NTV Telugu Site icon

Prajwal Revanna Case: ప్రజ్వల్ కేసులో ఐఫోన్ సర్వర్‌ యాక్సెస్ కోరుతున్న పోలీసులు.. కారణం ఏంటంటే..

Prajwal Revanna Case

Prajwal Revanna Case

Prajwal Revanna Case: ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ టేపుల వ్యవహారంలో ఐఫోన్ కీలకంగా మారింది. ఈ ఫోన్ ద్వారానే లైంగిక చర్యల్ని ప్రజ్వల్ వీడియో తీశారని పోలీసులు భావిస్తున్నారు. అయితే, కొన్ని నెలల ముందే ఈ ఫోన్‌ని తాను పోగొట్టుకున్నట్లు ప్రజ్వల్ సిట్‌కి తెలిపాడు. దీనిపై హోలినరసిపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు కూడా చెప్పాడు. ఈ ఫోన్ దొరికితే, ఈ కేసు మరింత బలంగా మారుతుందని సిట్ అధికారులు భావిస్తున్నారు. ప్రజ్వల్ రేవణ్ణ మొబైల్ ఫోన్‌ను గుర్తించేందుకు సిట్ ప్రయత్నిస్తోందని, ఇది మహిళలకు సంబంధించిన అసభ్యకరమైన వీడియోలను రికార్డ్ చేయడానికి ఉపయోగించిందని సిట్ భావిస్తోంది. ప్రజ్వల్ పోయిందని చెబుతున్న ఈ ఫోన్‌ని కీలక సాక్ష్యంగా పోలీసులు భావిస్తున్నారు.

Read Also: Pema Khandu: “సూర్యుడు ఉదయించే రాష్ట్రం”లో కమలాన్ని వికసింపచేశాడు..

దీంతో ఈ ఫోన్‌లో లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలు కనుగొనడానికి ఆపిల్ సర్వర్‌లను యాక్సెస్ చేయాలని సిట్ కోరింది. సాధారణంగా, Apple iCloudలో టెక్స్ట్‌లు, వాయిస్ రికార్డింగ్‌లు, ఫోటోలు మరియు వీడియోలతో సహా మొత్తం సమాచారాన్ని నిల్వ చేస్తుంది. దీంతో ప్రజ్వల్ రేవణ్ణ ఫోన్‌లోని వివరాలను తెలుసుకోవాలంటే ఐక్లౌడ్‌ని నేరుగా యాక్సెస్ చేయడమే మార్గమని సిట్ భావిస్తోంది. ఆపిల్ తన సర్వర్లను సిట్‌కి యాక్సెస్ చేసే అవకాశం ఇస్తే, ఈ కేసు దర్యాప్తు మరింత వేగం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రజ్వల్ లైంగిక వేధింపులకు గురైన బాధితురాలి వాంగ్మూలమే సిట్ వద్ద బలమైన సాక్ష్యం.

ఇదిలా ఉంటే సెక్స్ టేపుల వ్యవహారం బయలకు రావడంతో ఇండియా నుంచి జర్మనీ వెళ్లిన ప్రజ్వల్ ఇటీవల తిరిగి బెంగళూర్ వచ్చారు. ఎయిర్‌పోర్టులోనే అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూర్ కోర్టు శుక్రవారం ఇతనిని జూన్ 6 వరకు కస్టడీకి పంపింది. ఏప్రిల్ నెలలో ప్రజ్వల్ రేవణ్ణవిగా చెప్పబడుతున్న అనేక సెక్స్ వీడియోలు వైరల్ అయ్యాయి. రేవణ్ణ ఇంట్లో పనిచేస్తున్న 47 ఏళ్ల మహిళ ప్రజ్వల్ రేవణ్ణతో పాటు ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణపై లైంగిక వేధింపులు, అత్యాచారం కేసు నమోదు చేసింది.