ఇండియాలో మే నెలలో వంటనూనెల ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. వంటనూనెల ధరలు గతంలో ఎప్పుడూ లేనంతగా గరిష్టంగా పెరిగాయి. అమెరికా, ఇండోనేషియా, మలేషియా దేశాల నుంచి వంటనూనెలను దిగుమతి చేసుకుంటుంది. ఈద్ కారణంగా ఇండోనేషియాలో వంటనూనెల ఉత్పత్తిని నిలిపివేశారు. దీంతో ఇండియాకు దిగుమతి తగ్గుమతి తగ్గిపోయింది. అటు అమెరికాలో గతంలో బయోఫ్యూయల్‌లో 13శాతం రిఫైన్డ్ ఆయిల్ ను కలిపేవారని, కానీ, ఇప్పుడు 46 శాతం రిఫైన్డ్ ఆయిల్‌ను కలపుతున్నారని, దీంతో ఇండియాలో ధరలు పెరిగాయి. అయితే, గత నాలుగు రోజులుగా ఇండియాలో 15శాతం ధరలు తగ్గాయి. 46శాతం రిఫైన్డ్ ఆయిల్‌ను కలిపే విధానానికి స్వస్తి పలికే అవకాశం ఉన్నది. దీంతో ఇండియాలో రాబోయో రెండు వారాల్లో రూ.40 నుంచి రూ.50 వరకు ధరలు తగ్గే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు.
గుడ్‌న్యూస్ః దేశంలో తగ్గనున్న వంటనూనె ధరలు…
