Site icon NTV Telugu

Manipur: చుక్కల్ని అంటుతున్న నిత్యావసరాలు.. వేలల్లో వంటగ్యాస్, బియ్యం ధరలు

Mainipur Violence

Mainipur Violence

Manipur: సంక్షోభంలో చిక్కుకున్న మణిపూర్ రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు చుక్కల్ని అంటుతున్నాయి. చాలా చోట్ల బ్లాక్ దందా మొదలైంది. మూడు వారాల క్రితం మణిపూర్ లో గిరిజన, గిరిజనేతరుల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 70 మంది వరకు చనిపోయారు. సైన్యం, పారామిలిటరీ బలగాలు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా.. నిత్యవసరాలు ధరలు మాత్రం కొండెక్కాయి. మణిపూర్ కు ఇతర రాష్ట్రాల నుంచి రావాల్సిన దిగుమతులపై ప్రభావం పడింది.

Read Also: Car theft: కార్ దొంగిలించిన ముగ్గురు.. ఎవరికీ డ్రైవింగ్ రాదు.. ఆ తర్వాత జరిగింది తెలుసుకుంటే నవ్వాపుకోలేరు..

బియ్యం, బంగాళాదుంపలు, ఉల్లిపాయల ధరలు గతంలో పోలిస్తే రూ. 20 నుంచి రూ.30 వరకు పెరిగాయి. 50 కిలోల బియ్యం బ్యాగ్ ధర గతంలో రూ.900 ఉంటే ఇప్పుడు రూ. 1800కు చేరింది. ఎల్పీజీ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ లో రూ.1800 కు విక్రయిస్తున్నారు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 170కి చేరింది. 30 గుడ్ల ధర రూ.180 నుంచి రూ. 300 అయింది. ఇలా అన్నింటి ధరలు దాదాపుగా రెట్టింపు అయ్యాయి.

షెడ్యూల్ తెగ హోదా కోసం మెయిటీ కమ్యూనిటీ డిమాండ్ కు నిరసనగా ఇతర గిరిజన కమ్యూనిటీలు అయిన నాగా, కుకీలు హిల్ డిస్ట్రిక్స్ లో ‘గిరిజన సంఘీభావ యాత్ర’ నిర్వహిస్తున్న సమయంలో ఘర్షణలు చెలరేగాయి. దీంతో ఈ ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. రెండు వర్గాలు తీవ్రంగా దాడులు చేసుకున్నాయి. చాలా మంది రాష్ట్రం నుంచి ఇతర సరిహద్దు రాష్ట్రాల్లోకి వెళ్లారు. మణిపూర్ లో 53 శాతం మెయిటీ కమ్యూనిటీ ప్రజలు ఉంటారు. వీరంతా ఇంఫాల్ లోయలో నివసిస్తుంటారు. నాగా, కుకీలు గిరిజన హోదా ఉంది. వీరంతా కొంత ప్రాంతాల్లో నివసిస్తుంటారు. ఇదిలా ఉంటే కూకి తెగకు చెందిన కొంతమంది అక్రమంగా మయన్మార్ నుంచి మణిపూర్ లోకి ప్రవేశించి ఇక్కడ మైనారిటీ హోదా పొందుతున్నారని మెయిటీ వర్గం ఆరోపిస్తోంది. ఎన్ఆర్సీని చేపట్టాలని డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం 10,000 మంది సైన్యం, పారామిలిటరీ బలగాలు మణిపూర్ లో ఉన్నాయి.

Exit mobile version