Site icon NTV Telugu

Bangladeshi Singer: కోల్‌కతా ఈవెంట్‌కి బంగ్లాదేశ్ సింగర్.. సీపీఎం ఆహ్వానంపై వివాదం..

Bangladeshi Singer

Bangladeshi Singer

Bangladeshi Singer షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా జమాతే ఇస్లామీ, అన్సరుల్లా బంగ్లా వంటి మతోన్మాద ఉగ్ర సంస్థలు మైనారిటీలు ముఖ్యంగా హిందువులపై దాడులకు తెగబడుతున్నాయి. ఇదే కాకుండా ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్‌ నేతృత్వంలోని ప్రభుత్వంలోని ముఖ్యులు కూడా భారత్‌కి వ్యతిరేకంగా పెద్ద ప్రచారం చేస్తున్నారు.

Read Also: Barbaric : బార్బరిక్ టీజర్ రిలీజ్ చేసిన స్టార్ దర్శకుడు మారుతి

ఇదిలా ఉంటే, ఈ నెలలో కోల్‌కతాలో శివార్లలోని న్యూ టౌన్‌లో జ్యోతి బసు సెంటర్ ఫర్ సోషల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ నిర్వహించే పార్టీ సాంస్కృతిక కార్యక్రమంలో ప్రదర్శనకు ప్రముఖ బంగ్లాదేశ్ సింగర్‌ని ఆహ్వానించాలని సీపీఎం తీసుకున్న నిర్ణయంపై వివాదం తలెత్తింది. సీపీఎం కీలకమైన కేంద్ర కమిటీ సమావేశం ఈ ఏడాది జనవరి 17 నుంచి 19 వరకు న్యూ టౌన్‌లో జరగనుంది. దీనికి సీపీఎం పొలిట్ బ్యూరో కోఆర్డినేటర్ ప్రకాష్ కారత్ హాజరుకానున్నారు.

ఈ సందర్భంగా ప్రముఖ బంగ్లాదేశ్ సింగర్ రెజ్వానా చౌదరి బన్యాను ఆహ్వానించడం వివాదాస్పదంగా మారింది. బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్న తరుణంలో ఆ దేశానికి చెందిన గాయకురాలిని ఆహ్వానించడంపై బీజేపీ మండిపడుతోంది. బీజేపీ మాజీ జాతీయ ఉపాధ్యక్షుడు, పార్టీ లోక్‌సభ ఎంపీ దిలీప్‌ ఘోష్ మాట్లాడుతూ.. కమ్యూనిస్ట్ పార్టీకి దేశంలో సమర్థులైన సంగీత కళాకారులు ఎవరూ దొరకలేదా..? అని ప్రశ్నించారు.

Exit mobile version