NTV Telugu Site icon

L2: Empuraan: మోహన్ లాల్ ‘ఎంపురాన్’’‌తో బీజేపీ, కాంగ్రెస్ మధ్య వివాదం..

L2 Empuraan

L2 Empuraan

L2: Empuraan: మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన కొత్త సినిమా ‘ఎల్2:ఎంపురాన్’ వివాదానికి తెరతీసింది. కేరళలో అధికార కమ్యూనిస్ట్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ఈ సినిమాని స్వాగతించాయి. అయితే, అదే సమయంలో ‘‘సంఘ్ ఎజెండా’’ని సినిమా బహిర్గతం చేసిందని ఆ పార్టీలు, బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తున్నాయి. లూసిఫర్ సినిమా సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాలో పరోక్షంగా 2002 గుజరాత్ అల్లర్లను సూచిస్తుంది. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని ఈ సినిమా చర్చించింది.

Read Also: Char Dham Yatra 2025: కేదార్‌నాథ్ సహా చార్‌ధామ్‌లో రీల్స్, యూట్యూబ్ వీడియోలపై బ్యాన్..

దీంతో, రైట్ వింగ్ హిందుత్వ గ్రూపులు ఈ సినిమాను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ సినిమా ‘‘హిందూ వ్యతిరేక’’, ‘‘హిందూ దూషణ ప్రచార చిత్రం’’ అని పేర్కొంటున్నాయి. అయితే కమ్యూనిస్ట్, కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు ఈ సినిమాని ప్రశంసిస్తున్నాయి. కేరళ కాంగ్రెస్ యూత్ వింగ్ చీఫ్, పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూట్టిత్ ‘ఎంపురాన్’ని పాన్ ఇండియా సినిమాగా కొనియాడారు. మోహన్‌లాల్, పృథ్వీరాజ సుకుమారన్‌పై విద్వేషపూరిత ప్రచారాన్ని ఖండించారు. ‘‘కాశ్మీరీ ఫైల్స్’’, ‘‘కేరళ స్టోరీ’’ వంటి అబద్ధపు సినిమాలు, మతపరమైన ద్వేషం ఆధారంగా తీసిన సినిమాలను ప్రశంసించిన వ్యక్తులు, ఇప్పుడు ఎంపురాన్‌ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు.
మరోవైపు, కాంగ్రెస్ తన అధికారిక ఎక్స్ ఖతాలో బీజేపీ ఉద్దేశిస్తూ విమర్శలు చేసింది. కేరళ గడ్డపై ఎప్పుడూ అడుగుపెట్టని వారు, పన్నులు లేకుండా విడుదల చేసిన సీ-గ్రేడ్ ప్రచార సినిమాలు నిజమైన కేరళ స్టోరీ అని చెబుతున్నారు, ఇప్పుడు ప్రపంచస్థాయి మలయాళ సినిమా సంఘ్ ఎజెండాను, మన విస్తారమైన తీర ప్రాంతం, రెండు ప్రధాన ఓడరేవుల్ని నియంత్రించడాన్ని బహిర్గతం చేస్తే, ఇప్పుడు ఏడవడం ప్రారంభించారు అని ట్వీట్ చేసింది.