Site icon NTV Telugu

PM Modi: కాంగ్రెస్ ఎకోసిస్టమ్‌కి దాని సొంత భాషలోనే సమాధానం చెబుతాం.. పీఎం హెచ్చరిక..

Pm Modi

Pm Modi

PM Modi: లోక్‌సభలో పవర్‌ఫుల్ స్పీచ్‌తో ప్రధాని నరేంద్రమోడీ ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు.2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం ముందున్న అతిపెద్ద సవాల్ కాంగ్రెస్‌తో పాటు దాని ఎకోసిస్టమ్ అని అన్నారు. దేశ వ్యతిరేక కుట్రలనున దేశం ఎప్పటికీ అంగీకరించదని, దేశ అభివృద్ధిని అడ్డుకోవాలని చూసే ఈ వ్యవస్థను చూస్తూ సహించేది లేదని అన్నారు. ఈ ఎకోసిస్టమ్‌కి దాని ప్రతీ కుట్రకు దాని సొంత భాషలోనే సమాధానం చెబుతామంటూ హెచ్చరించారు.

Read Also: Sonakshi Sinha: పెళ్లై వారం కూడా కాలేదు..మొగుడితో చెప్పులు మోయిస్తోంది!

ఈ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడారు. కాంగ్రెస్ హిందువులను అరాచకవాదులుగా పేర్కొంటోందని, రాహుల్ గాంధ చేసిన వ్యాఖ్యల్ని దేశం ఎప్పటికీ మరిచిపోదని ప్రధాని అన్నారు. హిందూ సమాజాన్ని అవమానించడం ఫ్యాషన్‌గా మారిపోయింది. కాంగ్రెస్, ఇండీ కూటమి హిందువులను అవమానిస్తుందని ఆరోపించారు. సనాతన సంస్కృతిని డెంగీ, మలేరియా అని అభివర్ణిస్తున్న వారికి చప్పట్లు కొడుతున్నారని మండిపడ్డారు.

Exit mobile version