Congress: లోక్‌సభ ఎన్నికల ముందు పలువురు కీలకమైన కాంగ్రెస్ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఇటీవల మాజీ కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ శివసేనలో చేరగా, ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ బీజేపీలో చేరారు. ఇలా కీలక నేతలు చేయి జారిపోతున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్‌లో కీలకంగా ఉన్న మహిళా నేత రాధికా ఖఏరా కూడా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీలో ‘‘పురుష అహంకార మనస్తత్వం’’తో ఉన్న వారిని బయటపెడతానని శపథం చేశారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు తన రాజీనామా లేఖను పంపారు.
Read Also: Lok Sabha Polls 2024: ఎన్నికల ముందు కాంగ్రెస్‌కి భారీ షాక్.. బీజేపీలో చేరిన 200 మంది..
అయోధ్యలో రామమందిరాన్ని సందర్శించకుండా, రామ్ లల్లాని దర్శించుకోవాలని అనుకోవడంతో పార్టీ నుంచి ఒత్తిడి, విమర్శలు ఎదుర్కొన్నానని రాజీనామా లేఖలో ప్రస్తావించారు. నా జీవితంలో 22 ఏళ్లకు పైగా పార్టీకి కేటాయించానని, ఎన్ఎస్‌యూఐ నుంచి కాంగ్రెస్ మీడియా విభాగం వరకు పూర్తి నిజాయితీతో పనిచేశానని, అయితే నేను అయోధ్య రాముడికి మద్దతు ఇస్తున్నందున తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆమె చెప్పారు.
ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ యూనిట్‌లో తనకు అగౌరవం కలిగిందని ఆరోపించినప్పటికీ, తనకు న్యాయం జరగలేదని ఆమె ఆరోపించారు. నేను మహిళనే, పోరాడగలను, అదే నేను చేస్తున్నా, నాకు నా దేశ ప్రజలకు న్యాయం కోసం పోరాడుతూనే ఉంటానని లేఖలో పేర్కొన్నారు. నేను ఎల్లప్పుడూ ఇతరుల న్యాయం కోసం ప్రతీ వేదిక నుంచి పోరాడానని, కానీ నా సొంత విషయంలో మాత్రం పార్టీలో ఓడిపోయానని చెప్పారు.