Ashok Gehlot: రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ కోవిడ్-19, స్వైన్ ఫ్లూ బారిన పడ్డారు. జ్వరం, తక్కువ ఆక్సిజన్ సాచురేషన్ స్థాయిలు ఉండటంతో జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అచల్ శర్మ శనివారం చెప్పారు.
Read Also: BJP MP: రాహుల్ గాంధీ బంగ్లా చొరబాటుదారుల్ని ఏకం చేస్తూ.. హిందువులకు అన్యాయం చేస్తున్నాడు..
72 ఏళ్ల గెహ్లాట్ రెండు వైరల్ ఇన్ఫెక్షన్లలో బాధపడుతున్నారు. శుక్రవారం రాత్రి ఆయన హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. శుక్రవారం రాత్రి గెహ్లాట్ ఎక్స్ వేదికగా.. తనకు కొన్ని రోజులుగా జ్వరం ఉందని, కోవిడ్, స్వైన్ ఫ్లూ పాజిటివ్‌గా తేలిందని చెప్పారు. తదుపరి ఏడు రోజులు తాను ఎవరిని కలవనని చెప్పారు. వాతావరణం మారతున్నందు వల్ల ప్రతీ ఒక్కరూ కూడా తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు.