Site icon NTV Telugu

Manmohan Singh: మన్మోహన్ సింగ్ మృతిపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సంతాప తీర్మానం

Cwc

Cwc

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సంతాప తీర్మానం చేసింది. ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ సభ్యులు సమావేశమై సంతాప తీర్మానం చేశారు. శనివారం జరిగే మన్మోహన్‌సింగ్‌ అంతిమసంస్కారాల నిర్వహణపై కూడా చర్చించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, సోనియా, రాహుల్‌ గాంధీ, ప్రియాంక, తదితర నేతలంతా పాల్గొన్నారు. మన్మోహన్‌ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తామని సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది. ఆయన నిజమైన రాజనీతిజ్ఞుడని, దేశం కోసమే తన జీవితాన్ని దారపోశారని గుర్తు చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: SBI PO Recruitment 2024: ఎస్బీఐ పీఓ రిక్రూట్‌మెంట్ రిజిస్ట్రేషన్లు షురూ.. అప్లై చేసుకున్నారా?

భారతదేశ రాజకీయ, ఆర్థిక రంగంలో మన్మోహన్ ఒక మహోన్నత వ్యక్తి అని, ఆయన చేసిన కృషి దేశాన్ని మార్చివేసిందని తెలిపింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఆయనకు గౌరవాన్ని తెచ్చిపెట్టిందని గుర్తుచేసుకున్నారు. 1990 ప్రారంభంలో ఆర్థిక మంత్రిగా భారతదేశ ఆర్థిక సరళీకరణకు రూపశిల్పి అని కొనియాడారు. అసమానమైన దూరదృష్టితో వరుస సంస్కరణలను ప్రారంభించారన్నారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి రక్షించడమే కాకుండా ప్రపంచ మార్కెట్లకు కూడా తలుపులు తెరిచాయని స్మరణచేసుకున్నారు. నియంత్రణ సడలింపు, ప్రైవేటీకరణ మరియు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహం వంటి విధానాల ద్వారా భారతదేశం వేగవంతమైన ఆర్థిక వృద్ధికి పునాది వేశారని నేతలు నెమరువేసుకున్నారు. ఆయన నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉద్భవించిందని కొనియాడారు. ఇది ఆయన ప్రతిభ, దార్శనికతకు నిదర్శనం అని సీడబ్ల్యూసీ పేర్కొంది. నిజమైన రాజనీతిజ్ఞుడు మన్మోహన్ సింగ్ అని పేర్కొంది.

 

Exit mobile version