NTV Telugu Site icon

INDIA bloc: ఇండియా కూటమి నాలుగో సమావేశానికి తేదీ ఖరారు.? సీట్ల సర్దుబాటే ప్రధాన ఎజెండా..

India Bloc

India Bloc

INDIA bloc: ప్రతిపక్షాల ఇండియా కూటమి తదుపరి సమావేశానికి తేదీ ఖరారైనట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ 19న ఢిల్లీ వేదికగా కూటమి నాలుగో సమావేశం జరగబోతోంది. ఈ భేటీకి కాంగ్రెస్ అధ్యక్షత వహించబోతోంది. ముందుగా ఈ సమావేశాన్ని గత బుధవారం నిర్వహించాలని కాంగ్రెస్ భావించింది. అయితే కీలక నేతలైన సీఎం మమతాబెనర్జీ, సీఎం నితీష్ కుమార్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ వంటి వారు గైర్హాజరు అయ్యే అవకాశం ఉండటంతో ఈ భేటీని రద్దు చేశారు.

Read Also: CM Bhagwant Mann: “మేము సైలెంట్‌గా ఉన్నాం కాబట్టే సీఎం అయ్యాడు”.. పంజాబ్ సీఎం కూతురు సంచలన ఆరోపణలు..

అయితే డిసెంబర్ 19న ఇండియా కూటమి సమావేశం జరగబోతున్నట్లు తెలిసింది. రాబోయే ఎన్నికల్లో సీట్ల పంపకం ప్రధాన ఎజెండాగా ఉండబోతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, నేతలు వస్తారా..? లేదా.? అనే అంశం ఆధారంగా భేటీ ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది, ఈ రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సీట్ల పంపకంపై కాంగ్రెస్‌తో ఇతర పార్టీలు సీట్ల పంపకంపై పట్టుబట్టే అవకాశం ఉంది. మరోవైపు కూటమిలో విభేదాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, సమాజ్ వాదీల మధ్య సయోధ్య కూడా ఈ సమావేశంలో కీలకం కానుంది.

వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, మోడీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీతో పాటు టీఎంసీ, ఆప్, డీఎంకే, ఎన్సీపీ(శరద్ పవార్), శివసేన(ఉద్ధవ్), జేడీయూ, ఆర్జేడీ, కమ్యూనిస్ట్ పార్టీలు, మరికొన్ని పార్టీలు కలిసి ఇండియా కూటమి పేరిట కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేశాయి. కూటమి తొలిసమావేశాన్ని బీహార్ సీఎం నితీష్ కుమార్ పాట్నాలో నిర్వహించగా.. బెంగళూర్‌లో రెండో సమావేశం, ముంబైలో మూడో సమావేశం జరిగింది.

Show comments