NTV Telugu Site icon

Haryana Polls: ఎగ్జిట్ పోల్స్‌తో కాంగ్రెస్‌లో జోష్.. సీఎం కుర్చీపై మొదలైన లాబీయింగ్!

Haryana Polls

Haryana Polls

హర్యానా అసెంబ్లీ ఎన్నికలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. దాదాపు 61 శాతం పోలింగ్ నమోదైంది. ఇదిలా ఉంటే పోలింగ్ ముగియగానే సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఆ సంస్థలు చేసిన సర్వేలు విడుదల చేశాయి. దాదాపు అన్ని సర్వేలు హర్యానాలో కాంగ్రెస్‌కే మొగ్గుచూపించాయి. మెజార్టీ మార్కు దాటి హస్తం పార్టీ ప్రభుత్వాన్ని దక్కించుకుంటుందని సర్వేలు తేల్చాయి. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 55కి పైగా స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటాయని వెల్లడించాయి.

ఇది కూడా చదవండి: CPI Ramakrishna: బీజేపీ, మజ్లీస్‌ పార్టీలు మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పార్టీలు..

ఇదిలా ఉంటే హర్యానాలో కాంగ్రెస్ హస్తగతం చేసుకుంటుందన్న సర్వేలు తేల్చడంతో ముఖ్యమంత్రి పీఠంపై చర్చ మొదలైంది. ప్రధానంగా పార్టీ సీనియర్‌ నేతలు కుమారి సెల్జా, రణ్‌దీప్‌ సూర్జేవాలా, భూపీందర్‌ సింగ్‌ హుడా పేర్లు వినిపిస్తున్నాయి. భూపీందర్‌ సింగ్‌ హుడా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఎవర్న దానిపై పార్టీ హైకమాండే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని భావిస్తున్నామని… బీజేపీ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని.. అందుకే ప్రజలు మార్పును కోరుకుంటున్నారని భూపీందర్‌ సింగ్‌ తెలిపారు.

ఇది కూడా చదవండి: Amit Shah: మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో సోమవారం అమిత్ షా కీలక భేటీ..

హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 61 శాతం పోలింగ్ నమోదైంది. ఇక జమ్మూకాశ్మీర్‌లో హంగ్ ఏర్పడనున్నట్లు పేర్కొన్నాయి. ఈ రెండు రాష్ట్రాల ఫలితాలు అక్టోబర్ 8న విడుదల కానున్నాయి.

 

హర్యానా ఎగ్జిట్ పోల్స్..

మ్యాట్రిక్స్ సర్వే ప్రకారం.. బీజేపీకి 18-24, కాంగ్రెస్‌కి 56-62, జేజేపీకి 0-3 స్థానాలు వస్తాయని చెప్పింది.
పోల్ ఆఫ్ పోల్స్: బీజేపీ- 22, కాంగ్రెస్- 59 , జేజేపీ- 02
దైనిక్ భాస్కర్: బీజేపీ 15-29, కాంగ్రెస్ 44-54, జేజేపీ 0-1, ఆప్ 0-1, ఇతరులు 4-9
ధ్రువ్ రీసెర్చ్: బీజేపీ 22-32, కాంగ్రెస్ 50-64
పీపుల్స్ పల్స్: 20-32, కాంగ్రెస్ 49-61