Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..

  • కాంగ్రెస్ 59 ఏళ్ల నిరీక్షణకు తెర..
  • ప్రభుత్వంలో భాగమవుతున్న హస్తం పార్టీ..% విజయ్ మంత్రి వర్గంలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..
Congress

Congress

Congress: 59 ఏళ్ల కాంగ్రెస్ ఎదురుచూపులకు తెర పడింది. ముఖ్యమంత్రి విజయ్ హస్తం పార్టీ నిరీక్షణకు తెర దించారు. 5 దశాబ్ధాల తర్వాత తొలిసారిగా ప్రభుత్వంలో కాంగ్రెస్ మంత్రులు ఉండబోతున్నారు. సీఎం విజయ్ రేపు(గురువారం) తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు రాబోతున్నాయి. ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే ఏర్పాటు తర్వాత ఎప్పుడూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో భాగం కాలేదు. డీఎంకే కూటమిలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ, ప్రభుత్వంలో మాత్రం ఏ పదవి ఇవ్వలేదు.

తమిళనాడు మంత్రివర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరుతున్న తరుణాన్ని ‘‘చారిత్రక సందర్భంగా’’ కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్వకేట్ రాజేష్ కుమార్, తిరు పి. విశ్వనాథన్‌లు తమిళనాడు మంత్రివర్గంలో చేరబోతున్నట్లు పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఎక్స్‌లో పేర్కొన్నారు. వీరిద్దరికి ఖర్గే ఆమోదం లభించినట్లు తెలిపారు.

ఒక దశాబ్ధానికి పైగా డీఎంకే మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ను ఏనాడు కూడా ప్రభుత్వంలోకి తీసుకోలేదు. బయట నుంచి కాంగ్రెస్ మద్దతు కొనసాగేది. తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు అభ్యర్థులు గెలుపొందారు. ఈ ఐదుగురిలో ఇప్పుడు ఇద్దరికి మంత్రి పదవులు రాబోతున్నాయి.