Site icon NTV Telugu

Congress Satyagraha Deeksha: ఢిల్లీలో కాంగ్రెస్ స‌త్యాగ్ర‌హ దీక్ష‌.. భారీ బందోబస్త్

Congress

Congress

రక్షణ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “అగ్నిపధ్” పధకానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ “సత్యాగ్రహం” దీక్ష‌కు పిలుపు నిచ్చిన విష‌యం తెలిసిందే. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దు కాంగ్రెస్ పార్టీ “సత్యాగ్రహం” దీక్ష ప్రారంభం కానున్న సంద‌ర్భంగా.. కాంగ్రెస్ పార్టీ “సత్యాగ్రహం” లో ఏఐసిసి ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ఇతర సీనియర్ నేతలు పాల్గొననున్నారు. అయితే జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌న‌లు జ‌ర‌గ‌కుండా భారీ బందోబ‌స్తున్న ఏర్పాటు చేశారు పోలీసులు.

కాగా.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై నిరసన తెలుపుతున్న యువతకు కాంగ్రెస్ సంఘీభావం తెలిపిన విష‌యం తెలిసిందే. యువతకు మద్దతుగా నేడు న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున సత్యాగ్రహ ధర్నా చేయనున్నట్లు ప్రకటించింది. రక్షణ దళాల్లోకి నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై దాదాపు ఏడు రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలంగాణాలోని సికింద్రాబాద్‌లో కూడా హింసాత్మక సంఘటనలు జరిగాయి. బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని ఇళ్ళపై నిరసనకారులు దాడి చేశారు.

యువత నిరసనల కారణంగా దేశవ్యాప్తంగా శుక్రవారం 340 రైళ్ళ రాకపోకలపై ప్రభావం పడింది. రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, 94 మెయిల్ ఎక్స్‌ప్రెస్‌లు, 140 ప్యాసింజర్ రైళ్ళ రాకపోకలను రద్దు చేశారు. 65 మెయిల్ ఎక్స్‌ప్రెస్‌లు, 30 ప్యాసింజర్ రైళ్ళ సేవలను పాక్షికంగా రద్దు చేశారు. కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఇచ్చిన ఓ ట్వీట్‌లో, దేశ ప్రజలకు మేలు చేయని పథకాలను ప్రకటించడం బీజేపీ ప్రభుత్వానికి అలవాటైపోయిందని మండిపడింది. బీజేపీ నేతల ఆలోచనారహిత, అవివేక చర్యల వల్ల యావత్తు దేశం నేడు మండుతోందని ఆవేదన వ్యక్తం చేసింది.

Congress Satyagraha Deeksha: నేడు గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్ష

Exit mobile version