NTV Telugu Site icon

Congress New Office: నేడు డిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం..

Aicc

Aicc

Congress New Office: కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం కొత్త భవనాన్ని పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఈరోజు (జనవరి 15) ‘ఇందిరా భవన్’ను ప్రారంభించనున్నారు. గత ఐదు దశాబ్దాలుగా ఢిల్లీలోని 24, అక్బర్ రోడ్‌లో పార్టీ ప్రధాన కార్యాలయం ఉంది. ఇక, కాంగ్రెస్ నూతన కార్యాలయం 9-ఎ కోట్ల రోడ్డులో నిర్మించారు. నేటి ఉదయం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఏఐసీసీ ఆపీసును ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు సీనియర్ నేతలతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీలు పాల్గొననున్నారు.

Read Also: Delhi Elections : మరికొద్ది రోజుల్లో ఎన్నికలు ఇబ్బందుల్లో కేజ్రీవాల్ పార్టీ.. ఇప్పటి వరకు 5ఎఫ్ఐఆర్ లు నమోదు

ఇక, కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయ నిర్మాణం ప్రియాంక గాంధీ సారధ్యంలో జరిగినట్లు తెలుస్తుంది. ఆఫీసు మ్యాప్‌ను ఖరారు చేయడం మొదలుకొని పెయింటింగ్‌, చిత్రాలు, కర్టెన్లు, ఫర్నిచర్ వరకు ఆమెనే స్వయంగా అన్నింటినీ పర్యవేక్షించారని సమాచారం. ఈ కొత్త కార్యాలయంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలు పాత ఛాయాచిత్రాలను ఏర్పాటు చేశారని తెలుస్తుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెసీ వేణుగోపాల్ మంగళవారం నాడు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.. రేపు ఉదయం 10 గంటలకు , కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీల సమక్షంలో పార్టీ ప్రధాన కార్యాలయం ‘ఇందిరా భవన్‌’ను ఆరంభించనున్నారని పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్‌ పార్టీలో పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి, పరిపాలనా, సంస్థగత వ్యూహాత్మక విధుల నిర్వహణకు అనువుగా ఆధునిక సౌకర్యాలతో నూతనంగా ఇందిరా గాంధీ భవనం రూపొందించారు. 1978లో కాంగ్రెస్ (ఐ) ఏర్పడినప్పటి నుంచి పార్టీ ప్రధాన కార్యాలయం ’24, అక్బర్ రోడ్’లో కొనసాగింది.

Show comments