Site icon NTV Telugu

Rahul Gandhi: అమెరికాకు రాహుల్‌గాంధీ.. 2 రోజుల పాటు పర్యటన

Rahulgandhi1

Rahulgandhi1

కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత వచ్చే వారం అమెరికాకు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు అగ్ర రాజ్యంలో పర్యటించనున్నట్లు కాంగ్రెస్ ప్రచార విభాగం అధిపతి పవన్ ఖేరా తెలిపారు. ఏప్రిల్ 21, 22 తేదీల్లో రోడ్ ఐలాండ్‌లోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో రాహుల్ ప్రసంగించనున్నారు. అలాగే అధ్యాపకులు మరియు విద్యార్థులతో సంభాషించనున్నారు. పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ ఎన్నారైలు మరియు పార్టీ విదేశీ యూనిట్ సభ్యులను కూడా కలవనున్నట్లు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Supreme Court: “వారం రోజుల్లో సమాధానం చెప్పాలి” వక్ఫ్ కేసులో మధ్యంతర ఉత్తర్వులు

నేషనల్ హెరాల్డ్ కేసును ఢిల్లీ ప్రత్యేక కోర్టు విచారించడానికి కొన్ని రోజుల ముందు రాహుల్ గాంధీ అమెరికా పర్యటన చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు బావ రాబర్ట్ వాద్రా కూడా ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. మనీలాండరింగ్ కేసులో 3 రోజుల నుంచి వాద్రాను అధికారులు విచారిస్తున్నారు. రాజకీయ కక్షతోనే ఇదంతా జరుగుతోందని రాబర్ట్ వాద్రా ఆరోపించారు.

ఇది కూడా చదవండి: Tirupati: అర్ధరాత్రి విద్యార్థినుల గదిలో దూరిన ప్రిన్సిపాల్.. ట్విస్ట్‌ ఏంటంటే..?

Exit mobile version