NTV Telugu Site icon

Wayanad landslides: వయనాడ్ ప్రకటన.. అమిత్ షాపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్..

Amit Shah

Amit Shah

Wayanad landslides: కేరళలోని వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై శుక్రవారం సభాహక్కుల ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున కేరళ ప్రభుత్వానికి ముందస్తు హెచ్చరికలు ఇచ్చామని అమిత్ షా చేసిన వాదనపై కాంగ్రెస్ అభ్యతరం వ్యక్తిచేసింది. కేరళ ఈ హెచ్చరికలపై చర్యలు తీసుకోలేదని షా అన్నారు. అయితే, ఈ వాదనల్ని ప్రివిలేజ్ నోటీసుల్లో జైరాం రమేష్ తోసిపుచ్చారు.

Read Also: UPI Payment: యూపీఐ వినియోగదారులకు అలర్ట్.. ఆ రోజున చెల్లింపులు జరగవు.. కేవలం వారికే!

కేంద్ర ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు జారీ చేసిందనే కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటన రాజ్యసభను తప్పుదోవ పట్టించిందని స్పష్టమైంది, అవి అబద్ధమని నిరూపించబడ్డాయని నోటీసులో పేర్కొన్నారు. సభ్యుడు లేదా మంత్రి సభను తప్పుదారి పట్టించడం ఉల్లంఘనగా పరిగణించబడుతుందని, ఇది సభను ధిక్కరించడమే అని ప్రివిలేజ్ నోటీసుల్లో పేర్కొంది.

జూలై 31 బుధవారం రాజ్యసభలో అమిత్ షా ప్రసంగిస్తూ జూలై 23న కేరళ ప్రభుత్వానికి కొండచరియలు విరిగిపడతాయనే ముందస్తు హెచ్చరిక జారీ చేసినట్లు హోంమంత్రి పేర్కొన్నారు. జూలై 23న, ఘటన జరగడానికి ఏడు రోజుల ముందు కేరళ ప్రభుత్వానికి కేంద్రం ముందస్తు హెచ్చరికలు చేసిందని, ఆ తర్వాత జూలై 24, 25 తేదీల్లో మరోసారి హెచ్చరించామని, జూలై 26న వార్నింగ్ ఇచ్చామని చెప్పారు. 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కేరళని హెచ్చరించినట్లు అమిత్ షా చెప్పారు. వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటనలో 300 మందికి పైగా ప్రజలు మరణించారు.