NTV Telugu Site icon

Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘దేశద్రోహి’,‘సోరోస్ ఏజెంట్’.. దూషించిన బీజేపీ ఎంపీలపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై దూషిస్తూ వ్యాఖ్యలు చేసినందుకు ఇద్దరు బీజేపీ ఎంపీలపై కాంగ్రెస్ శుక్రవారం ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టింది. బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, సంబిత్ పాత్రలపై సభాహక్కుల తీర్మానాన్ని తీసుకువచ్చారు. పార్లమెంట్ నడపకుండా చేసే కుట్రలో ఇదొక భాగమని, వారు అదానీ ఇష్యూకి భయపడి దాని నుంచి పారిపోతున్నారని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అన్నారు. ప్రతిపక్షాలను అణిచివేసేందుకు కేంద్ర ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ ఆరోపించింది.

‘‘నిన్న ప్రతిపక్ష నేతపై బీజేపీ నేతలు అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. మేము ప్రివిలేజ్ మోషన్ ఎవరిపై ప్రవేశపెట్టామో వారిని సభలో ఈ రోజు కూడా మాట్లాడేందుకు అనుమతించారు. స్పీకర్ ప్రభుత్వ ఒత్తిడిలో ఉన్నారు’’ అని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అన్నారు. ‘‘మోడీ అదానీ భాయ్ భాయ్’’ అనే సందేశాన్ని కలిగిన టీషర్టుని ధరించి కాంగ్రెస్ నిన్నటి నుంచి ఆందోళన చేస్తోంది. అయితే, అదానీ డీప్ స్టేట్ కాంగ్రెస్ పార్టీని నిరోధించదు అని ఆయన అన్నారు.

Read Also: Mamta Kulkarni: 25 ఏళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన అలనాటి బాలీవుడ్ నటి మమత.. భావోద్వేగంతో కంటతడి

గురువారం జీరో అవర్ చర్చలో బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ మధ్య విగ్వాదం నడిచింది. అమెరికాలో రాహుల్ గాంధీ సమావేశాలను దూబే ప్రశ్నించారు. భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ఓపెన్ సొసైటీ ఫౌండేషన్‌కి చెందిన సలీల్ శెట్టి గురించి రాహుల్ గాంధీని ప్రశ్నించారు. భారత్ జోడో యాత్రకు అతను డబ్బులు ఇచ్చాడా..? అని నిలదీశారు. రాహుల్ గాంధీ అమెరికా వెళ్లి బంగ్లాదేశ్ మరణహోమానికి కారణమైన ముష్ఫకుల్ ఫజల్‌ని కలిశాడని, ప్రధాని మోడీని వ్యతిరేకించే ఇల్హన్ ఒమర్, రోఖన్నా, భార్బరా లీలను కలిశాడని చెప్పాడు. రాహుల్ గాంధీ కలిసిన వారు కాశ్మీర్‌ని విడదీయాలనుకునే వారు, ఖలిస్తాన్‌ని సృష్టించే వారితో సంబంధాలు ఏమిటి..? అని అడిగారు.

రాహుల్ గాంధీ ‘‘అత్యున్నత ద్రోహి’’ అని మరో అభివర్ణించారు. ‘‘భారతదేశాన్ని అస్థిర పరిచేందుకు ప్రయత్నిస్తున్న ఈ ట్రయాంగిల్ గురించి మాట్లాడేందుకు భయపడను. ఈ ట్రయాంగిల్‌లో అమెరికాకు చెందిన జార్జ్ సోరోస్, అమెరికా ఏజెన్సీలు, ఓసీసీఆర్‌పీ పేరుతో పెద్ద న్యూస్ పోర్టల్ మరోవైపు రాహుల్ గాంధీ ఉన్నారు. అతడిని దేశద్రోహి అనేందుకు ఏమాత్రం సంకోచించను’’ అని ఎంపీ సంబిత్ పాత్ర వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది.

Show comments