NTV Telugu Site icon

Caste Row: కులం వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్.. ప్రధాని మోడీపై ఫిర్యాదు..

Pm Modi

Pm Modi

Caste Row: లోక్‌సభ వేదికగా బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన ‘కులం’ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. రాహుల్ గాంధీని కులగణన డిమాండ్‌ని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్‌తో పాటు దాని మిత్ర పక్షాలు బీజేపీని విమర్శిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ వ్యాఖ్యలు చేసిన అనురాగ్ ఠాకూర్‌కి ప్రధాని నరేంద్రమోడీ మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీపై కాంగ్రెస్ సభహక్కుల ఉల్లంఘన ఫిర్యాదును చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ చరణ్‌జిత్ సింగ్ చన్నీ లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కి ఫిర్యాదు చేశారు.

Read Also: Renu Desai: టచ్ కూడా చేయలేదు, చంపకుండా వదిలేస్తే పనిమనిషి పెంచింది.. రెండో పెళ్లిపై రేణు దేశాయ్ సంచలనం

ఠాకూర్ చేసిన “కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలను” సభ కార్యకలాపాల నుండి తొలగించినట్లు చన్నీ తన లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ తొలగించబడిన ప్రసంగాన్ని ప్రధాని మోడీ ఎక్స్‌లో ట్వీట్ చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధాని మోడీ ఠాకూర్ వ్యాఖ్యల్ని ఎక్స్ వేదిగా పోస్ట్ చేసి, ఇవి తప్పకవినాల్సిన వాస్తవాలు, ఇండీ కూటమి డర్టీ రాజకీయాలను బట్టబయటు చేసిందని వ్యాఖ్యానించారు.

ప్రధాని ఈ వ్యాఖ్యల్ని పోస్ట్ చేయడం ద్వారా ‘‘పార్లమెంటరీ ప్రత్యేక హక్కుల్ని తీవ్రంగా ఉల్లంగిచారు’’ అని కాంగ్రెస్ ఆరోపించింది. అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్వినియోగం, రాజ్యాంగ విరుద్ధం అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. మంగళవారం ఠాకూర్ సభలో మాట్లాడుతూ.. కులం తెలియనవారు కుల గణన గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. నన్నున ఎంత కావాలంటే అంత అవమానించవచ్చు, కానీ కుల గణణ పార్లమెంట్‌లో ఆమోదింపజేసుకుంటామనే విషయాన్ని మరిచిపోవద్దని అన్నారు.