Site icon NTV Telugu

Siddaramaiah: సీఎల్పీ లీడర్ గా సిద్దరామయ్య ఎన్నిక.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానం

Siddaramaiah

Siddaramaiah

Siddaramaiah: సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా, డీకే శివకుమార్ ను డిప్యూటీ సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ఈ రోజు ప్రకటించింది. ఢిల్లీ నుంచి ఇద్దరు నేతలు ఈ రోజు సాయంత్రం బెంగళూర్ చేరుకున్నారు. బెంగళూర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ శాసనసభాపక్షం(సీఎల్పీ) మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో సిద్దరామయ్యను తమనేతగా, సీఎల్పీ లీడర్ గా ఎమ్మెల్యేలంతా ఎన్నుకున్నారు. సిద్దరామయ్య పేరును ఆర్వీ దేశ్‌పాండే, హెచ్‌కే పాటిల్, ఎంబీ పాటిల్, లక్ష్మీ హెబ్బాల్కర్ ప్రతిపాదించారు. ఎమ్మెల్యేంతా ఏకగ్రవంగా ఎన్నుకున్నారు.

Read Also: IPL 2023: హైదరాబాద్ కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ.. 10 ఓవర్లకు స్కోర్ ఎంతంటే..?

ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ సభ్యుల బృందం గవర్నర్ ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటు గురించి గవర్నర్ తో చర్చించారు.  గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ ను కలిసేందుకు సిద్దరామయ్యతో పాటు డీకే శివకుమార్, ఇతర కీలక నేతలు రాజ్ భవన్ వెళ్లారు. మరోవైపు సిద్దరామయ్య ఇంటి ముందు ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఇదిలా ఉంటే మాజీ సీఎం, బీజేపీ నేత బసవరాజ్ బొమ్మై , సీఎంగా ఎన్నికైన సిద్దరామయ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ పేరిట అధికార ప్రకటన వెలువడింది. సిద్దరామయ్యను ముఖ్యమంత్రిగా, డీకే శివకుమార్ ను ఉపముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానించారు. వీరిద్దరితో పాటు మంత్రి మండలి ప్రమాణస్వీకారం మే 20 మధ్యాహ్నం 12.30 గంటలకు ఉండనుంది. బెంగళూర్ లోని కంఠీరవ స్టేడియంలో అట్టహాసంగా ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది.

Exit mobile version