UP: పిలవని పేరంటానికి కాంగ్రెస్ నేతలు.. షాక్ ఇచ్చిన మాయావతి..
- మాయవతి ఇంటికి వెళ్లిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు..
- అపాయింట్మెంట్ లేదని తిప్పి పంపిన భద్రతా సిబ్బంది..
- ఇద్దరు నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన కాంగ్రెస్..
- మాయవతితో పొత్తుకు ప్రయత్నిస్తున్నారంటూ ఊహాగానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP: వచ్చే ఏడాది ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈలోపే కాంగ్రెస్ పార్టీ పొత్తులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, దళిత నాయకురాలిగా ఉన్న బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతితో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ ఆరాటపడుతున్నట్లు కనిపిస్తోంది. మంగళవారం రోజు ఇద్దరు కాంగ్రెస్ నాయకులు ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా లక్నోని మాయావతి ఇంటికి వెళ్లారు. అయితే, ముందస్తు అనుమతి లేకపోవడంతో ఆమె భద్రతా సిబ్బంది వారిని వెనక్కి పంపింది.
కాంగ్రెస్ నేతలు రాజేంద్ర పాల్ గౌతమ్, బారాబంకీ ఎంపీ తనుజ్ పునియాలు మంగళవారం ఆమె ఇంటికి చేరుకుని, మాయావతిని కలిసేందుకు తమను అనుమతించాలని అభ్యర్థించారు. కానీ వీరిని కలిసేందుకు ఆమె సుముఖత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. మాయావతి ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి, ఆమెను మర్యాదపూర్వకంగా కలిసేందుకు తాము వచ్చినట్లు వారిద్దరు చెప్పుకున్నారు. మరోవైపు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సందేశాన్ని తెలియజేయడానికి వెళ్లినట్లు వస్తున్న వార్తల్ని వారు ఖండించారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
ఈ పరిణామంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఇద్దరు నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. షోకాజ్ నోటీసులు జారీ చేుసింది. ఇది అధికారిక పర్యటన కాదని చెప్పింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ మాట్లాడుతూ.. ఇలాంటి పర్యటనలు హైకమాండ్ ఆమోదంతోనే జరుగుతాయని, ముందుగానే నిర్ణయించబడుతాయని, ఈ పర్యటకు పార్టీ అనుమతి లేదని చెప్పారు.
2027 యూపీ ఎన్నికలకు ముందు మాయావతితో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందనే వార్తలు గుప్పుమంటున్నాయి. మాయావతితో జతకడితే ముస్లిం, దళిత, ఓబీసీ ఓట్లు చీలకుండా అడ్డుకోవచ్చని, ఇది బీజేపీ విజయాన్ని అడ్డుకోవచ్చనే కాంగ్రెస్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందనే వార్తలు వస్తున్నాయి.
తాజావార్తలు
-
TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
-
Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!
-
IND vs WI 2nd T20: నేడు భారత్, వెస్టిండీస్ రెండో టీ20.. పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇదే!
-
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
-
NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!