Haryana Assembly Elections: హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన తర్వాత బీజేపీ ఎదుర్కొన్న తిరుగుబాటు.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనూ కొనసాగుతుంది. తాజాగా ఆ పార్టీకి సీనియర్ నాయకుడు రాజీనామా చేసి, ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే, నిన్న ( శుక్రవారం) హస్తం పార్టీ హర్యానా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో గర్హి సంప్లా- కిలోయ్ నుంచి మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, జులనా నుంచి కొత్తగా చేరిన వినేష్ ఫోగట్, హోడల్ నుంచి రాష్ట్ర పీసీసీ చీఫ్ ఉదయ్ భాన్ తో కూడిన 32 మంది పేర్లను కాంగ్రెస్ మొదటి జాబితాలో ఉంచింది. ఈ లిస్టులో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజిందర్ సింగ్ జూన్ బహదూర్‌గఢ్ నుంచి మరోసారి పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చింది.
Read Also: Vettaiyan : వేట్టయాన్ ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్ .. రిలీజ్ వాయిదా పడే అవకాశం.?
అయితే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాజేష్ జూన్ తన మద్దతుదారులతో సమావేశమై పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేసినట్లు తెలిపారు. అలాగే, ఈసారి ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా రాజేష్ జూన్ మాట్లాడుతూ.. “కాంగ్రెస్ నాయకత్వం నన్ను మోసం చేసింది.. నాకు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారు కానీ ఆ హామీని నిలబెట్టుకోలేదు.. కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చే ఓట్ల కంటే రెట్టింపు ఓట్లు సాధించి నేను ఎమ్మెల్యేని అవుతానని ఆయన చెప్పారు.
Read Also: America : అమెరికాలో యూదులే టార్గెట్.. కెనడాలో పాకిస్థాన్ వ్యక్తి అరెస్ట్
కాగా, 2019లో కూడా బహదూర్‌ఘర్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజిందర్ సింగ్ జూన్‌కు కాంగ్రెస్ తరపున టికెట్ ఇచ్చిన తర్వాత రాజేష్ జూన్ పార్టీపై తిరుగుబాటు చేశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు తమ నామినేషన్‌లను సమర్పించారు.. కానీ, మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా జోక్యం చేసుకున్న తర్వాత రాజేష్ జూన్ తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. ఇక, లోక్‌సభ ఎన్నికల్లో హర్యానాలోని 10 లోక్‌సభ స్థానాల్లో 5 స్థానాలను గెలుచుకుని ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్.. 2014 నుంచి పాలిస్తున్న అధికార బీజేపీని గద్దె దించాలని చూస్తుంది. ఈ నేథప్యంలో పార్టీలో అంతర్గత విభేదాలకు తావు లేకుండా చూస్తుంది.
Read Also: Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్ ప్రత్యేకత.. ఏడు ముఖాలు, ఏడు సర్పాలు, 24 చేతులు..
ఇక, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఓట్ల విభజనను నివారించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుకు ముందుకు రావడంతో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. పొత్తుకు సంబంధించి బుధవారం సూత్రప్రాయంగా ఒప్పందం ప్రకటించినప్పటికి.. ఆప్ 10 సీట్లు కోరుతుండగా, కాంగ్రెస్ ఐదు నుంచి ఏడు స్థానాలను మాత్రమే ఇచ్చేందుకు సిద్ధంగా ఉండటంతో ప్రతిష్టంభన ఏర్పడినట్లు సమాచారం.