NTV Telugu Site icon

Karnataka: కాంగ్రెస్‌కు డీకే శివకుమార్ తలనొప్పి.. నోట్లు వెదజల్లడంపై విమర్శలు..

Dk Shiva Kumar

Dk Shiva Kumar

Karnataka: కర్ణాటక ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. మే 10న పోలింగ్ నిర్వహించి మే 13న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. అయితే ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చిపడింది. మంగళవారం మాండ్యాలో ప్రచారం చేస్తున్న కర్ణాటక కాంగ్రెస్ పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ నోట్లను వెదజల్లడం జాతీయ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చే ఒక రోజు ముందు ఈ ఘటన జరిగింది. దీనిపై ప్రతిపక్షాలు ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసింది.

Read Also: Kodali Nani On 2024 Elections: 2024 ఎన్నికల్లో టీడీపీకి వచ్చేవి నాలుగు సీట్లే

డీకే శివకుమార్ కరెన్సీ నోట్లను వెదజల్లిన వీడియో వైరల్ గా మారింది. 500 వందల రూపాయల నోట్లను వెదజల్లడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇదిలా ఉంటే మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య చెంపదెబ్బ కొట్టిన వీడియో కూడా ప్రస్తుతం కన్నడనాట వైరల్ అవుతోంది. డీకే శివకుమార్ కరెన్సీని వెదజల్లడంపై ఇది అవినీతి సొమ్ము అని, అధికారంలోకి వస్తే కర్ణాటకను దోచుకుంటారని బీజేపీ విమర్శిస్తోంది.

దీనిపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. కాంగ్రెస్ కర్ణాటక ప్రజలను బిచ్చగాళ్లలా చూస్తోందని ఆయన విమర్శించారు. ప్రజలే వారికి గుణపాఠం చెబుతారని అన్నారు. ప్రజలే నిజమైన యజమానులు అని చెప్పారు. కాంగ్రెస్ నిరాశలో ఉందని, మిగిలిన సీట్లను బీజేపీ నుంచి వచ్చిన వారికి ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోందని బొమ్మై ఆరోపించారు. మిగిలిన 100 స్థానాల్లో కాంగ్రెస్ కర్ణాటక చీఫ్ డీకే శివకుమార్ ఎవరికి ఇవ్వలేదని, మా బీజేపీ ఎమ్మెల్యేలకు, నాయకులకు ఫోన్ చేసి పోటీ చేయమని ప్రతిపాదిస్తున్నారని సీఎం అన్నారు. ఇది కాంగ్రెస్ పరిస్థితి అని, వారు నిజంగా బలంగా ఉంటే ఎందుకు మా ఎమ్మెల్యేలను పిలుస్తున్నారని ప్రశ్నించారు.

Show comments