కర్నాటక రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా చేయడంపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి. వయసు నియమావళి ప్రకారం బీజేపీ యడ్యూరప్పను తప్పించిందని బీజేపీ చెబుతున్నది. అధిష్టానం తనపై ఎలాంటి ఒత్తిడీ తీసుకురాలేదని, బీజేపీ నియమావళికి కట్టుబడి రాజీనామా చేసినట్టు అటు యడ్యూరప్ప కూడా పేర్కొన్నారు. అయితే, ప్రతిపక్షాలు మాత్రం ఈ అంశాన్ని మరోలా చూస్తున్నాయి. ముఖ్యమంత్రిని బలవంతంగా తప్పించారని సెటైర్లు వేస్తున్నాయి. అవినీతి కారణంగానే ముఖ్యమంత్రిని తొలగించి చేతులు కడుక్కోవాలని కేంద్రం చూస్తున్నట్టు కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా పేర్కొన్నారు.
Read: కోలుకున్న సుకుమార్… “పుష్ప” షూటింగ్ రీస్టార్ట్
మోడీ రాజకీయాలకు అనేకమంది సీనియర్ నేతలు బలయ్యారని అన్నారు. ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, శాంత కుమార్, సుమిత్రా మహాజన్, ఉమా భారతీ, సీపీ ఠాకూర్, ఏకే పటేల్, డాక్టర్ హర్షవర్ధన్, రవి శంకర్ ప్రసాద్ తదితరులు తప్పుకోవాల్సి వచ్చిందని అన్నారు. అన్ని రాష్ట్రాల్లో తమ ముద్రను వేసుకోవడానికి ప్రధాని మోడీ, అమిత్ షాలు ప్రయత్నిస్తున్నారని అన్నారు. రాష్ట్రాల్లో బీజేపీ వ్యక్తులను మాత్రమే మారుస్తున్నదని, కానీ బీజేపీ తన క్యారెక్టర్ ను మాత్రం అలానే ఉంచుతుందని ఆయన మండిపడ్డారు.
