NTV Telugu Site icon

పెగాస‌స్‌, మోడీపై రాహుల్ గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు…

పార్ల‌మెంట్ స‌మావేశాల‌కు ముందు పెగాస‌స్ అంశం దేశాన్ని అతలాకుత‌లం చేసింది. పెగాస‌స్ స్పేవేర్‌తో దేశంలోని ప్ర‌ముఖుల‌పై కేంద్రం నిఘా ఉంచింద‌ని పలు అంత‌ర్జాతీయ మీడియాలో క‌థ‌నాలు రావ‌డంతో ప్ర‌తిప‌క్షాలు ఈ అంశాన్ని పార్లమెంట్ ఉభ‌య‌స‌భ‌ల్లో చర్చించాల‌ని ప‌ట్టుబ‌డుతున్నాయి. అయితే, ఈ అంశాన్ని కేంద్రం లైట్‌గా తీసుకుంది.  పెగాస‌స్ అంశం చ‌ర్చ‌కు తీసుకురాకుండా మిగ‌తా అంశాల‌ను చ‌ర్చించేందుకు కేంద్రం ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది.

Read: బిగ్ ఓటిటి రిలీజ్ : పృథ్వీరాజ్ సుకుమారన్ “కురుతి” రెడీ

 కానీ, అందుకు ప్ర‌తిప‌క్షాలు ఒప్పుకోక‌పోవ‌డంతో పార్ల‌మెంట్ ఉభయ‌స‌భల్లో నిత్యం ర‌గ‌డ జ‌రుగుతూనే ఉన్న‌ది. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  ఉగ్ర‌వాదుల‌కు వ్య‌తిరేకంగా ఉప‌యోగించే పెగాస‌స్ స్పేవేర్ ను మ‌న ఫోన్ల‌లోకి జోప్పించార‌ని, ఈ అంశంపై చ‌ర్చ చేప‌ట్ట‌కుండా ప్ర‌తిప‌క్షాల గొంతు నొక్కేస్తోంద‌ని రాహుల్ గాంధీ ఆరోపించారు.   పెగాస‌స్ అంశంపై కేంద్రం త‌ప్ప‌నిస‌రిగా స‌మాధానం చెప్పి తీరాల‌ని రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు.  

Read: ఎల్లో టాప్ లో… ఏంజిల్ ఆర్న!

ఉగ్ర‌వాదుల‌కు వ్య‌తిరేకంగా వాడాల్సిన పెగాస‌స్ స్పేవేర్‌ను రాజ‌కీయ‌, ప్ర‌ముఖుల మొబైల్ ఫోన్ల‌ను హ్యాక్ చేసేందుకు ఉప‌యోగిస్తున్నారి ఆయ‌న మండిప‌డ్డారు. పెగాస‌స్ స్పేవేర్‌ను ప్ర‌భుత్వం కొనుగోలు చేసిందా?  ప్ర‌జాస్వామ్య సంస్థ‌ల‌పై ఉప‌యోగించారా? అని రాహుల్ గాంధీ ప్ర‌శ్నించారు.  కేంద్రం దీనిపై త‌ప్ప‌నిస‌రిగా స‌మాధానం చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.  తాము పార్ల‌మెంట్‌ను అడ్డుకోవ‌డం లేద‌ని, కేవ‌లం త‌మ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నామ‌ని, పెగాస‌స్ పై చ‌ర్చ జ‌రిగి తీరాల్సిందే అని అయ‌న స్ప‌ష్టం చేశారు.