Site icon NTV Telugu

Kuldeep Bishnoi: కాంగ్రెస్ కు షాక్.. బీజేపీలో చేరిన కీలక కాంగ్రెస్ నేత

Kuldeep Bishnoi

Kuldeep Bishnoi

Kuldeep Bishnoi Joins BJP: కాంగ్రెస్ పార్టీకి వరసగా షాకులు తగులుతూనే ఉన్నాయి. ఓ వైపు నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసు కాంగ్రెస్ అధినాయకత్వాన్ని వెంటాడుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని, రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తోంది. బుధవారం యంగ్ ఇండియా కార్యాలయాన్ని సీజ్ చేసింది ఈడీ. ఇదిలా ఉంటే వరసగా కాంగ్రెస్ నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో కీలక నేేతగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలో బీజేపీ పాార్టీలో చేరబోతున్నారు.

తాజాగా హర్యానాకు చెందిన కాంగ్రెస్ నేత కుల్ దీప్ బిష్ణోయ్ తన భార్య రేణుకా బిష్ణోయ్ తో కలసి బీజేపీలో చేరారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ సహా బీజేపీ సీనియర్ నేతల ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకున్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా పనిచేసిన కుల్ దీప్ బిష్ణోయ్ హర్యానాలో కీలక నేతగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ఉత్తమ ప్రధానిగా కొనియాడారు కుల్ దీప్ బిష్ణోయ్. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బిష్ణోయ్ బీజేపీకి ఓటు వేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అతన్ని బహిష్కరించింది.  దీంతో నిన్న బుధవారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఈ రోజు బీజేపీలో చేరారు.

Read Also:Rahul Gandhi: నేష‌న‌ల్ హెరాల్డ్ కేసు.. భయపడేది లేదు..

కుల్ దీప్ బిష్ణోయ్ హర్యానాతో పాటు  రాజస్థాన్ లో కూడా గణనీయమైన మద్దతు కలిగిన కీలక నేతగా ఉన్నారు. రాజస్థాన్  బిష్ణోయ్ కమ్యూనిటీ మద్దతు కూడా కుల్ దీప్ బిష్ణోయ్ కు ఎక్కువగా ఉంది. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీకి బలం చేకూరే అవకాశం ఉంది.  అంతకుముందు 2014 రాష్ట్ర ఎన్నికల్లో హర్యానా జనహిత్ పార్టీ ప్రారంభించిన బిష్ణోయ్ ఆ తరువాత దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు. తాజాగా ఆయన బీజేపీలో చేరారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ కుమారుడే కుల్ దీప్ బిష్ణోయ్.  జాట్ యేతర ఓటు బ్యాంకుకు కీలకంగా మారనున్నారు బిష్ణోయ్.

Exit mobile version