Amit Shah: కర్ణాటక ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ, బీజేపీని గద్దె దించాలని కాంగ్రెస్ హోరాహోరీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కలబురిగి సభలో ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యలు ప్రచారాన్ని రసవత్తంగా మార్చాయి. మోడీ ‘విష సర్పం’ అంటూ ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ ఘాటుగానే స్పందిస్తోంది.
Read Also: Joe Biden: బైడెన్‌కు మతిమరుపు వచ్చిందా..? చివరి విదేశీ పర్యటన కూడా గుర్తు లేదా..?
శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి మతిపోయిందని అన్నారు. ప్రపంచం మొత్తం ప్రధాని మోడీని పొగుడుతుంటే కాంగ్రెస్ మాత్రం విష సర్పం అంటూ పిలుస్తున్నారంటూ కర్ణాటక ఎన్నికల ర్యాలీలో ఆయన మండిపడ్డారు. అంతకుముందు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఖర్గే వ్యాఖ్యలపై మండిపడ్డారు. కాంగ్రెస్ నిరాశతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని, భారత్ పై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచం మొత్తం మోడీని ఆమోదించిందని, సోనియా గాంధీ ఆదేశాల మేరకే కాంగ్రెస్ నేతలు ఇలా చేస్తున్నారని, ఆమె విషకన్య అంటూ, భారత్ ను నాశనం చేయాలనుకుంటున్న పాకిస్తాన్, చైనాలకు ఆమె ఏజెంట్ అంటూ బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ యత్నాలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున వివాదాస్పదం అవడంతో మల్లికార్జున ఖర్గే వివరణ ఇచ్చారు. నేను మోడీని వ్యక్తిగతంగా విమర్శించలేదేని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు విషపూరితం అని అని అన్నానని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం కర్ణాటక ప్రచారంలో కాకరేపుతున్నాయి.