NTV Telugu Site icon

Delhi: ఢిల్లీలో ముగిసిన రెండ్రోజుల గవర్నర్ల సమావేశం.. ఏం చర్చించారంటే..!

Vicepresident

Vicepresident

దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో గవర్నర్ల సదస్సు జరిగింది. ఈ సదస్సులో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు హాజరయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానంగా మహిళా సాధికారత, గిరిజనులు అభివృద్ధి సహా పలు అంశాలపై చర్చించారు.

ఇది కూడా చదవండి: Kishan Reddy: యామినీ కృష్ణమూర్తి మృతికి కేంద్రమంత్రి సంతాపం

అలాగే నూతన న్యాయ చట్టాలు, ఉన్నత విద్యలో సంస్కరణలు, యూనివర్సిటీల అక్రిడేషన్, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, వెనుక బడిన జిల్లాలు, సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిలో గవర్నర్ల పాత్రపై రాష్ట్రపతి, ప్రధాని మోడీ దేశానిర్దేశం చేశారు. గవర్నర్‌లు తమ కార్యాలయ పనితీరును మెరుగుపరచడంతో పాటు ప్రజల సంక్షేమం కోసం తమ విలువైన ఆలోచనలు మరియు సూచనలతో ముందుకు వచ్చారని రాష్ట్రపతి ప్రశంసించారు.

ఇది కూడా చదవండి: Himachalpradesh : హిమాచల్ ప్రదేశ్‌లో క్లౌడ్ బరస్ట్… ఇప్పటి వరకు 50 మంది మృతి

Show comments