NTV Telugu Site icon

Rahul Gandhi: రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ప్రయాణికుల నినాదాలు.. కాంగ్రెస్ కార్యకర్తలతో ఘర్షణ..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: ఉత్తర్ ప్రదేశ్‌లో సంభాల్ పట్టణంలోని షాహీ జామా మసీదు సర్వే వివాదం హింసాత్మకంగా మారింది. సర్వేకు వచ్చిన అధికారులు, పోలీసులపై వేల మంది గుంపు రాళ్లదాడికి పాల్పడింది. ఇది మొత్తం హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. 30 మంది వరకు పోలీసులకు గాయాలయ్యాయి. ఇదిలా ఉంటే, ఈ హింసాత్మక ఘటనలో బాధితుల్ని కలిసేందుకు ఈ రోజు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ, ఇతర కాంగ్రెస్ ఎంపీలు సంభాల్ పర్యటనకు వెళ్లారు.

Read Also: PSLV-C59 Launch Postponed: చివరి నిమిషంలో PSLV-C59 రాకెట్‌ ప్రయోగం వాయిదా.. కారణం ఇదే..!

పర్యటన నేపథ్యంలో ఢిల్లీ-యూపీ సరిహద్దుల్లోనే రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య కారణంగా అక్కడికి వెళ్లేందుక అనుమతించలేదు. ఈ నేపథ్యంలో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే, గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న ప్రయాణికులు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాహుల్ గాంధీని, ఇతర కాంగ్రెస్ నేతల్ని అడ్డుకునేందుకు ఘాజీపూర్ బార్డర్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో అసహనానికి గురైన ప్రయాణికులు ‘‘రాహుల్ గాంధీ ముర్దాబాద్’’ అంటూ నినాదాలు చేశారు. అయితే, అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఈ నినాదాలతో ఆగ్రహం చెందారు. దీంతో ప్రయాణికులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.

సంభాల్ నగరంలో ఇటీవల హింసాత్మక ఘటనలు చోటు చేసున్నాయి. మొఘల్స్ కాలం నాటి షామీ జామా మసీదు పురాతన హరిహర ఆలయమని హిందూ పక్షం స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు సర్వేకి ఆదేశించింది, ఈ నేపథ్యంలో నవంబర్ 24న సర్వేకి వెళ్లిన అధికారులపై దాడి జరిగింది. ఈ హింసాత్మక ఘటనలపై 7 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ ఘటనలో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎంపీ జియాఉర్ రెహ్మాన్ బార్క్, స్థానిక ఎమ్మెల్యే కుమారుడి హస్తం ఉన్నట్లు అభియోగాలు నమోదయ్యాయి.

Show comments