NTV Telugu Site icon

Kerala High Court: మహిళల శరీరాకృతి గురించి కామెంట్లు చేసినా లైంగిక వేధింపే..

Kerala

Kerala

Kerala High Court: మహిళపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులో కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అమ్మాయిల శరీరాకృతి గురించి తప్పుడు కామెంట్స్ చేయడం వారి గౌరవానికి భంగం కలిగించడమే అన్నారు. అది కూడా లైంగిక వేధింపుల నేరంగానే పరిగణించాలని పేర్కొనింది. తనపై నమోదైన కేసు కొట్టేయాలని కేరళ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు మాజీ ఉద్యోగి వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం ఈ కామెంట్స్ చేసింది.

Read Also: ACB : ముందు మీరు విచారణకు రండి.. తర్వాత చెప్తాం.. కేటీఆర్‌కు ఏసీబీ సెకండ్ నోటీసు

అయితే, కేరళ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగి విధుల్లో ఉన్న సమయంలో తనపై వేధింపులకు పాల్పడ్డారని ఆ సంస్థలో పని చేసిన ఓ మహిళా స్టాఫర్‌ పోలీసులకు కంప్లైంట్ చేసింది. 2013 నుంచి ఆయన తనను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు అభ్యంతరకర మెసేజ్‌లు, వాయిస్‌ కాల్స్‌ చేసేవారని బాధితురాలు ఫిర్యాదులో వెల్లడించింది. తన శరీరాకృతిని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలతో తనను వేధింపులకు గురి చేశారని చెప్పుకొచ్చింది. దీంతో పోలీసులు ఆయనపై లైంగిక వేధింపుల కింద కేసు ఫైల్ చేశారు.

Read Also: America: గౌతమ్ అదానీపై యూఎస్లో విచారణ.. బైడెన్ సర్కార్పై రిప‌బ్లిక‌న్ నేత‌ ఫైర్!

ఇక, తనపై నమోదైన ఈ కేసు కొట్టివేయాలంటూ సదరు మాజీ ఎంప్లాయి కేరళ హైకోర్టులో పిటిషన్‌ వేశాడు. ఆమెకు అందమైన శరీరం ఉందన్న ఉద్దేశంలోనే తాను అలా కామెంట్స్ చేశానూ.. దీన్ని లైంగిక వేధింపుల నేరంగా చూడొద్దని న్యాయస్థానాన్ని అతడు కోరాడు. కానీ, సదరు ఉద్యోగి విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. మహిళల శరీరాకృతిపై వ్యాఖ్యలు చేయడం లైంగిక వేధింపుల కిందకే వస్తుందని కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏ బదరుద్దీన్ తిరస్కరించారు.

Show comments