NTV Telugu Site icon

Mumbai: ఏక్‌నాథ్‌షిండేపై కమెడియన్ అనుచిత వ్యాఖ్యలు.. కునాల్ కమ్రా‌ ఆఫీసుపై శివసేన కార్యకర్తల దాడి

Kunal Kamra

Kunal Kamra

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేపై కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. షిండేను ఉద్దేశించి దేశద్రోహి అంటూ చేసిన వ్యాఖ్యలు ఆగ్రహానికి దారి తీశాయి. షిండే అభిమానులు, శివసేన కార్యకర్తలు హాస్య నటుడుకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. ఇక కునాల్‌కు సంబంధించిన కార్యాలయంపై శివసేన కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. కునాల్‌ను అరెస్ట్ చేయాలంటూ పెద్ద ఎత్తున నిసననలు చేపట్టారు.

ఇది కూడా చదవండి: Asha Workers: నేడు చలో హైదరాబాద్ కి పిలుపునిచ్చిన ఆశా వర్కర్లు..

ఉద్ధవ్ ఠాక్రే నుంచి కునాల్ కమ్రా డబ్బులు తీసుకున్నారని.. అందుకే ఏక్‌నాథ్ షిండేను టార్గెట్ చేస్తున్నారని లోక్‌సభ ఎంపీ నరేష్ మ్హాస్కే ఆరోపించారు. కునాల్ ఒక కాంట్రాక్ట్ కమెడియన్ మండిపడ్డారు. డబ్బుల కోసం తమ నాయకుడిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని నరేష్ మ్హాస్కే ధ్వజమెత్తారు. మహారాష్ట్రలోనే కాదు.. కునాల్ దేశంలో ఎక్కడా స్వేచ్ఛగా తిరగలేడని హెచ్చరించారు. శివసేన సైనికులు అతన్ని వెంటాడుతూనే ఉంటారని వార్నింగ్ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: CSK vs MI: వాహ్.. సీఎస్‌కే బౌలర్స్ అదరగొట్టారు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన ముంబై..

ఇక శివసేన కార్యకర్తల దౌర్జన్యంపై శివసేన(యూబీటీ) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ ధ్వజమెత్తారు. ఇక శివసేన కార్యకర్తలు చేసిన విధ్వంసానికి సంబంధించిన దృశ్యాలను శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. రాష్ట్రంలో ఒక బలహీనమైన హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఉన్నారని ఆరోపించారు. మహారాష్ట్ర రాజకీయాలపై కునాల్ వ్యంగ్య పాట రాశారని.. దానికి షిండే అభిమానులు కునాల్ ఆస్తులపై ధ్వంసం చేయడం దారుణం అన్నారు.