Air India: ఎయిర్ ఇండియా ఇటీవల వరస ప్రమాదాలతో సతమతమవుతోంది. సాంకేతిక సమస్యలు, పక్షుల తాకిడి వంటి ఘటనలు రిపీట్ అవుతున్నాయి. తాజాగా, కొలంబో నుంచి చెన్నై వస్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని పక్షి ఢీకొట్టింది. దీంతో అధికారులు విమానాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. 158 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల్ని సురక్షితంగా విమానం నుంచి దించినట్లు చెప్పారు.
Read Also: USA: అమెరికా సైన్యం తీసుకున్న నిర్ణయంతో ముస్లిం, సిక్కులలో ఆగ్రహం..
ఈ ఘటన తర్వాత ఎయిర్ ఇండియా ఇంజనీర్లు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సంఘటన కారణంగా విమానయాన అధికారులు తిరుగు ప్రయాణాన్ని రద్దు చేశారు. 137 మంది ప్రయాణికుల కోసం మరో విమానాన్ని ఏర్పాటు చేసి, ఆ తర్వాత వారిని కొలంబోకు తరలించినట్లు చెప్పారు.
