Anil Vij: “బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు”.. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..

  • బొద్దింకలు చాలా అసహ్యకరమైన కీటకం..
  • చిన్న పిల్లలు కూడా చెప్పుతో నలిపేస్తారు..
  • పేరు మార్చుకోవాలని కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
Anil Vij

Anil Vij

Anil Vij: సోషల్ మీడియా సెన్సేషన్ ‘‘కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)’’ శనివారం జంతర్ మంతర్ వేదికగా నిరసన కార్యక్రమం నిర్వహించింది. నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ నిరసన కేవలం ట్రైలర్ మాత్రమే అని, రాబోయే కాలంలో ఉద్యమం మరింత తీవ్రం అవుతుందని సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే కేంద్రాన్ని హెచ్చరించారు.

ఇదిలా ఉంటే, సీజీపీపై హర్యానా ఇంధన శాఖ మంత్రి అనిల్ విజ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతీ ఒక్కరికి ఉంటుందని, అయితే వారు తమ పేరు మార్చుకోవాలని సలహా ఇచ్చారు. బొద్దింక చాలా అసహ్యకరమైన కీటకం అని, దాన్ని చూస్తే చిన్నపిల్లవాడు కూడా చెప్పుతో నలిపేస్తాడని ఆయన అన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో ఆయన ఒక పోస్ట్ చేశారు. ప్రజాస్వామ్యంలో తమ అభిప్రాయాలనున వ్యక్తీకరించే హక్కు ప్రతీ ఒక్కరికి ఉంటుందని, ఆ హక్కు వినియోగించుకోవాలని అని అన్నారు. కానీ బొద్దింక వంటి వింత పేరుతో రాజకీయాలు చేయడం అస్సలు మంచిది కాదని చెప్పారు.

×
×
Ad