NTV Telugu Site icon

cobra inside a shoe: షూలో దూరిన నాగుపాము.. వీడియో వైరల్

Snake In Shoe

Snake In Shoe

దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో చాలా సరీసృపాల ఆవాసాలైన పుట్టలు, బొరియలు వర్షాలకు, వరదలకు కొట్టుకుపోతున్నాయి.  కీటకాలు, పాములు వంటి వాటికి పాత వస్తువులు, చీకటి ప్రాంతాలు ఆవాసంగా మారుతున్నాయి. ఇళ్లలోకి వస్తుంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో సేఫ్ ప్లేసులను ఎంచుకుంటున్నాయి పాములు. తాజాగా ఓ నాగుపాము వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎక్కడా చోటు దొరకనట్లుగా ఓ నాగుపాము షూ లో దూరింది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి సుశాంత నంద షేర్ చేసింది. ప్రస్తుతం షూలో పాము దూరిన వీడియో వైరల్ గా మారింది.

‘‘ మీరు వర్షాకాలలో వీటిని విచిత్రమైన ప్రదేశాల్లో కనుగొంటారు. జాగ్రత్తగా ఉండండి. శిక్షణ పొందిన సిబ్బంది సహాయం తీసుకోండి’’ అంటూ సుశాంత నంద ట్విట్టర్ లో వీడియోతో పాటు కామెంట్ చేశారు. ఈ వీడియోలో ఓ స్నేక్ క్యాచర్ షూ నుంచి నాగుపామును బయటకు తీయడం గమనిస్తాం. ఎంతో నేర్పుగా ఆమె పామును షూ నుంచి బయట తీస్తుంది. బయటకు తీసే క్రమంలో పాము నుంచి వచ్చే బుస కట్టే శబ్ధం ఎంతో భయంకరంగా ఉంది.

Read Also: Loan Apps :ప్రాణాలు తీస్తున్న లోన్ యాప్ లు..చేతులెత్తుస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు

ప్రస్తుతం ఈ వీడియోకు 1.71 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను చూసిన వాళ్లు స్నేక్ క్యాచర్ చేసిన సాహసాన్ని ప్రశంసిస్తున్నారు. దీంతో పాటు ఎంతో భయంకరంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. వర్షాకాలంలో చీకటిగా, వెచ్చగా ఉండే ప్రాంతాలను పాములు, తేళ్లు ఎంచుకుంటాయి. ముఖ్యంగా షూలు, బైక్ సీటు కింది ప్రాంతాల్లో పాములు దూరడాన్ని చాలా సార్లు చూశాం. వీటిని ఉపయోగించే సమయంలో ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది.