CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్ట్.. సీఎం విజయ్ కీలక నిర్ణయం..

  • జ్యోతిష్యుడు రాధన్ పండిత్‌కు కీలక పోస్టు..
  • ఓఎస్డీగా నియమించిన తమిళనాడు ప్రభుత్వం..
  • విజయ్‌కు వ్యక్తిగత సలహాదారుగా నియామకం..
Radhan Pandit

Radhan Pandit

CM Vijay: తమిళనాడు టీవీకే ప్రభుత్వం ఏర్పడింది. మద్దతు విషయంలో హైడ్రామా, ట్విస్టులు చొటుచేసుకున్నప్పటికీ చివరకు విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. మే 10న మధ్యాహ్నం 3.45 గంటలకు ముందుగా విజయ్ ప్రమాణస్వీకారం ఉంటుందని నిర్ణయించారు. అయితే, విజయ్ వ్యక్తిగత జ్యోతిష్యుడు రాధన్ పండిత్ వెట్రివేల్ ఇచ్చిన సలహా మేరకు ఈ సమయాన్ని ఉదయం 10 గంటలకు మార్చారు. విజయ్ రాజకీయ ప్రస్థానంలో రాధన్ పండిత్‌కు కీలక స్థానం ఉంది.

Read Also: KTR: “23 లక్షల మందికి మానసిక క్షోభ”.. నీట్ ప్రశ్నాపత్రం లీక్‌పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్..

ఇదిలా ఉంటే, ఇప్పుడు విజయ్ తన వ్యక్తిగత జ్యోతిష్యుడైన రాధన్ పండిత్‌కు ప్రభుత్వంలో కీలక పోస్టు కేటాయించారు. తమిళనాడు ప్రభుత్వం ఆయనను ‘‘ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ’’గా నియమించింది. రాధన్ పండిత్ ముఖ్యమంత్రికి ‘‘ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(రాజకీయ వ్యవహారాలు)గా నియమితులయ్యారు. సీఎం విజయ్‌కు ఆయన అధికారికంగా సలహాదారుగా ఉండనున్నారు.

తమిళనాడు ఎన్నికలకు ముందే విజయ్ సీఎం అవుతారని రాధన్ జ్యోస్యం చెప్పారు. గతంలో సీఎంగా పనిచేసిన జయలలితకు సలహాదారుగా ఉండేవారు. అనేక మంది రాజకీయ నాయకుడు ఆయన ఆఫీస్ ముందు బారులు తీరేవారని సమాచారం. ఎన్నికల ఫలితాల్లో టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మారిన తర్వాత విజయ్ ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపిన వారిలో రాధన్ కూడా ఉన్నారు. నాలుగు దశాబ్ధాలుగా రాధన్ పండిత్ జ్యోతిష్య రంగంలో ఉన్నారు. అనేక రాజకీయ దిగ్గజాలకు జ్యోతిష్యం చెప్పేవారు. నిజానికి జయలలిత రాధన్ పండిత్‌ను సంప్రదించిన తర్వాతే కీలక నిర్ణయాలు తీసుకునే వారని చెబుతారు.