తమిళనాడులో జరగబోయే ఒక్క రాజ్యసభ స్థానంపై సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ సీటును కీలక భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్‌కు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 18న తమిళనాడులో ఒక్క రాజ్యసభ స్థానానికి ఎన్నిక జరగనుంది. అయితే ఈ స్థానాన్ని టీవీకేకు కాకుండా.. కీలక మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు ముఖ్యమంత్రి విజయ్ కేటాయించారు.
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 స్థానాలు కైవసం చేసుకుంది. అయితే మ్యాజిక్ ఫిగర్ తక్కువ కావడంతో కాంగ్రెస్ మద్దతుతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తమిళనాడులో కాంగ్రెస్ ఐదు స్థానాలు గెలుచుకుంది. చిన్న పార్టీల మద్దతుతో టీవీకే ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో.. ఖాళీ అయిన ఒక్క రాజ్యసభ సీటును హస్తం పార్టీకి విజయ్ కేటాయించారు.
27 రాజ్యసభ స్థానాల్లో పోలింగ్..
దేశవ్యాప్తంగా ఖాళీ అయిన 27 రాజ్యసభ స్థానాలకు ఈనెల 18న ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 18న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, మిజోరాం రాష్ట్రాల్లో మొత్తం 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు.
For the election to the Rajya Sabha seat from Tamil Nadu, scheduled to be held on the 18th June, TVK-led alliance has allotted the Rajya Sabha seat to its alliance partner, the Indian National Congress.
Accordingly, the seat to be filled through the Rajya Sabha election from… https://t.co/dyYiOvf67T pic.twitter.com/zhD1muQJgt
— ANI (@ANI) June 3, 2026
