NTV Telugu Site icon

Delhi: రూ.లక్ష కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం రేఖాగుప్తా.. మహిళలకు సాయం ప్రకటన

Delhicm

Delhicm

ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వం తొలి ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రూ.లక్ష కోట్ల బడ్జెట్‌ను ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నట్లు ప్రకటించారు. మహిళలకు రూ.2,500 సాయం అందిస్తున్నట్లు రేఖా గుప్తా తెలిపారు. మహిళా సమ్మాన్ యోజన పథకం కోసం మొత్తం రూ.5,100 కోట్లు మంజూరు చేసింది. దేశ రాజధానిలో అర్హులైన ప్రతి మహిళకు రూ.2,500 సాయం అందిస్తామని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Supreme Court : పార్టీ ఫిరాయింపులకు ఏడాది పూర్తి.. సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు

26 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ.. తొలి బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టింది. గత ఫిబ్రవరిలో వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 70 స్థానాలకు గాను బీజేపీ 48, ఆప్ 22 స్థానాలు గెలుచుకుంది. విద్యుత్, రోడ్లు, నీరు వంటి 10 రంగాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. మొత్తం రూ.లక్ష కోట్లతో బీజేపీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇది చారిత్రాత్మకమైన బడ్జెట్‌గా రేఖా గుప్తా అభివర్ణించారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో మెరుగైన కనెక్టివిటీ కోసం రూ. 1,000 కోట్లు ప్రతిపాదించారు. మహిళల భద్రత కోసం.. నగరం అంతటా 50,000 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఇది కూడా చదవండి: Hyderabad: దారుణం.. కానిస్టేబుల్‌పై బీర్ బాటిల్‌తో దాడి చేసిన బైక్ రేసర్..

ఇక ఢిల్లీలో యమునా నది, మురుగు నీటి శుద్ధి కోసం రూ.9000 కోట్లు కేటాయించారు. ఇక నీటి ట్యాంకర్లకు జీపీఎస్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆరోగ్య రంగానికి రూ.6,874 కోట్లు కేటాయించారు. గత ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలతో గొడవలు పెట్టుకునేది… మేమైతే కలిసి పని చేస్తామని చెప్పారు.

ఇక ఆప్‌కు బీజేపీ ప్రభుత్వానికి మధ్య చాలా తేడా ఉందని రేఖా గుప్తా గుర్తుచేశారు. ఆప్ కేవలం వాగ్దానాలు ఇస్తుంది. కానీ అమలు చేయదు. మేము హామీలు ఇస్తే అమలు చేస్తామన్నారు. వాళ్లు శీష్ మహల్ నిర్మించుకుంటారు.. మేము పేదలకు ఇళ్లు నిర్మిస్తాం. వాళ్లు లక్షల విలువైన మరుగుదొడ్లు ఏర్పాటు చేసుకుంటారు.. మేము మురికివాడ ప్రజలకు మరుగుదొడ్లు నిర్మిస్తామని రేఖా గుప్తా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.