Site icon NTV Telugu

CM Omar Abdullah: పాక్ ఆర్మీ చీఫ్- డొనాల్డ్ ట్రంప్ భేటీపై జమ్ముకాశ్మీర్ సీఎం సంచలన వ్యాఖ్యలు

Abdulla

Abdulla

CM Omar Abdullah: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌- పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు అసిఫ్‌ మునీర్‌ల లంచ్‌ భేటీపై తీవ్ర దుమారం కొనసాగుతుంది. ఈ ఇష్యూపై తాజాగా జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. యూఎస్ తన ప్రయోజనాలను పొందే వరకు మాత్రమే ఇతర దేశాలతో ఫ్రెండ్షిప్ చేస్తుంది.. అలాగే, తనను తాను కాపాడుకునేందుకు ఏమైనా చేస్తుందని కామెంట్స్ చేశాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్‌కు శ్వేతసౌధంలో ఆతిథ్యం ఇవ్వడంపై విలేకరులు అడిగిన క్వశ్చన్ కు ఆయన సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also: Sonia Gandhi: ఇజ్రాయెల్- ఇరాన్ ఉద్రిక్తతపై స్పందించిన సోనియా గాంధీ..

అయితే, డొనాల్డ్ ట్రంప్ తన ఇష్టాలకు అనుగుణంగా నడుస్తారు.. ఎవరిని విందుకు ఆహ్వానించాలో, ఎవరిని ఆహ్వానించకూడదో మనం ఆయనకు చెప్పగలమా? అని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. అమెరికా అధ్యక్షుడు మనకు ప్రత్యేకమైన స్నేహితుడు అని మనం అనుకుంటున్నాం.. ట్రంప్ మన స్నేహాన్ని గౌరవిస్తారా లేదా అనేది మరో విషయం.. యూఎస్ తన స్వప్రయోజనాల కోసం మాత్రమే పని చేస్తుందని పేర్కొన్నాడు. అవసరం లేనప్పుడు మరే ఇతర దేశాన్ని కనీసం పట్టించుకోదని ఆరోపించాడు.

Exit mobile version