Bihar Chief Minister Nitish Kumar tests positive for COVID19: బీహార్ సీఎం నితీష్ కుమార్ కు మరోసారి కరోనా సోకింది. ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో ఓ సారి కరోనా పాజిటివ్ రాగా.. మళ్లీ తాజాగా కరోనా బారిన పడ్డట్లు సీఎం కార్యాయలం వెల్లడించింది. మంగళవారం తనకు కరోనా సోకినట్లు.. గత రెండు మూడు రోజులుగా తనను సంప్రదించిన వారు, సన్నిహితంగా ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని సీఎం నితీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
గత రెండు మూడు రోజుల నుంచి సీఎం జ్వరంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్ లో ఉన్నారు. డాక్టర్ల సూచన మేరకు ఐసోలేషన్ లో ఉంటూ.. విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆరోగ్యం బాగా లేని కారణంగానే సోమవారం ఢిల్లీలో జరిగిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారానికి హాజరుకాలేదు. కొన్ని రోజుల నుంచి జ్వరం వస్తుండటంతో కరోనా పరీక్షలు చేయించుకోగా.. సోమవారం పాజిటివ్ గా తేలింది. గత కొన్ని రోజులుగా బీహార్ లో రోజుకు 300 నుంచి 400 వరకు కరోన కేసులు నమోదు అవుతున్నాయి. వీటిలో రాజధాని పాట్నాలోన ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి.
Read Also: COVID19: ఇండియాలో తగ్గిన కరోనా ..15 వేలకు దిగవన కేసులు
దేశవ్యాప్తంగా కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 15 వేల కన్నా దిగువన కరోనా కేసులు నమోదు అయ్యాయి. పాజిటివిటీ రేటు కూడా తగ్గింది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా కేరళ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లో ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి.
