NTV Telugu Site icon

Karnataka: ఉద్రిక్తత పెంచుతున్న మంగళూర్ హత్య.. 144 సెక్షన్ విధింపు..

Karnataka

Karnataka

CM Bommai assures action in Mangaluru murder case: కర్ణాటకలో మంగళూర్ హత్య ఉద్రిక్తతలకు కారణం అవుతోంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ఇప్పటికే ఈ కేసులో విచారణ ప్రారంభించారు పోలీసులు. ఘటనకు కారణం అయినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హామీ ఇచ్చారు. ఆందోళన చేస్తున్న ప్రజలు శాంతి భద్రతలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు శాంతిగా ఉండాలని కోరారు.

Read Also: Conductor Saved Woman: సభాష్ .. ట్విట్టర్ ద్వారా యువతి ప్రాణాలు కాపాడిన కండెక్టర్

శనివారం రాత్రి కర్ణాటక మంగళూర్ లోని సూరత్ కల్ తో గుర్తు తెలియని వ్యక్తులు జలీల్ అనే వ్యక్తిని పొడిచి హత్య చేశారు. జలీల్ తన దుకాణం ముందు నిలబడి ఉండగా దండగులు కత్తిలో పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఈ హత్య మతపరమైన కోణంలో జరిగిందా..? అనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కత్తిపోట్లతో గురైన జలీల్ ను ఆస్పత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మరణించాడు.

ఆదివారం ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు జలీల్ మృతదేహాన్ని మసీదు ఎదుట ఉంచి నిరసన తెలిపారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని.. నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో మతపరంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడకుండా డిసెంబర్ 25 ఆదివారం ఉదయం 6 గంటల నుండి డిసెంబర్ 27 మంగళవారం ఉదయం 6 గంటల వరకు సూరత్‌కల్, బజ్‌పే, కావూరు, పనంబూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఆర్‌పిసి సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించారు.

డిసెంబర్ 27 వ తేదీ ఉదయం 10 గంటల వరకు మద్యం విక్రయాలపై నిషేధం విధించారు. బహిరంగ సభలు, ఊరేగింపులు, ఊరేగింపులు మరియు ఆయుధాలు, పేలుడు పదార్థాలు, బాణసంచా కాల్చడంపై నిషేధం విధించబడింది. రెచ్చగొట్టే నినాదాలు చేయడం, ప్రజల మనోభావాలను దెబ్బతీసే కార్యకలాపాలకు పాల్పడడంపై కూడా నిషేధం ఉంది.