Site icon NTV Telugu

Bhagwant Mann: రేపు పంజాబ్ సీఎం రెండో పెళ్లి

Bhagawanth Mann

Bhagawanth Mann

పంజాబ్ ముఖ్యమంత్రి ఆప్ కీలక నేత భగవంత్ మాన్ రెండో పెళ్లికి సిద్ధం అయ్యాడు. రేపు అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో భగవంత్ మాన్ వివాహం జరగనుంది. తన ఇంట్లోనే పెళ్లి కార్యక్రమం జరగనున్నట్లు తెలిసింది.  ఈ వివాహానికి కుటుంబ సభ్యులతో పాటు, అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హజరుకానున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యే అవకాశం ఉంది.

భగవంత్ మాన్ కి ఇది రెండో పెళ్లి, 48 ఏళ్ల మాన్ గతంలో ఇంద్రప్రీత్ కౌర్ ని పెళ్లి చేసుకున్నారు. వీళ్లకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వీరిద్దరు ఆరేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఇంద్రప్రీత్ కౌర్ పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్నారు.   ఇటీవల  పంజాబ్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మార్చి 16న మాన్ ప్రమాణ స్వీకారానికి వారు పంజాబ్ వచ్చారు. అయితే తాజాగా రేపు  భగవంత్ మాన్, డాక్టర్ గురుప్రీత్ కౌర్ ను వివాహం చేసుకోబోతున్నట్లు తెలిసింది.

Read Also:DGCA: స్పైస్‌జెట్‌కు డీజీసీఏ షోకాజ్ నోటీసులు

ఎంపీగా ఉన్న భగవంత్ మాన్ ఇటీవల జరిగిన పంజాబ్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి ఆప్ అధికారాన్ని హస్తగతం చేస్తున్నారు. తన సంగ్రూర్ లోక్ సభ ఎంపీ అభ్యర్థిత్వాన్ని వదులుకుని సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఆప్ దెబ్బకు సీఎం చన్నీతో పాటు, మాజీ సీఎం అమరిందర్ సింగ్, బాదల్ కుటుంబానికి చెందిన పలువులు ఘోర పరాజయాన్ని చవిచూశారు.

 

 

 

 

 

 

Exit mobile version