Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Cm Bhagwant Mann Moves Resolution In Assembly Seeking Immediate Transfer Of Chandigarh To Punjab

Punjab: పంజాబ్‌ అసెంబ్లీ కీలక తీర్మానం

Published Date :April 1, 2022 , 4:09 pm
By Sudhakar Ravula
Punjab: పంజాబ్‌ అసెంబ్లీ కీలక తీర్మానం
  • Follow Us :
  • google news
  • dailyhunt

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసి అధికారంలోకి వచ్చింది ఆమ్‌ఆద్మీ పార్టీ.. ఇక, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భగవంత్‌ మాన్‌ పగ్గాలు చేపట్టిన తర్వాత.. పలు కీలక నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు.. ఇక, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌ను తక్షణం పంజాబ్‌కు బదిలీ చేయాలని డిమాండ్‌ చేస్తోంది పంజాబ్‌ సర్కార్.. దీనిపై పంజాబ్‌ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్రపాలిత ప్రాంతం నిర్వహణలో సమతుల్యతను దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించిన సీఎం.. పంజాబ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 1966 ప్రకారం, పంజాబ్ రాష్ట్రాన్ని హర్యానా రాష్ట్రంగా, చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతంగా విభజించడంతోపాటు పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాలను అప్పటి కేంద్ర పాలిత ప్రాంతమైన హిమాచల్‌ ప్రదేశ్‌కు ఇచ్చారని.. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంలో పేర్కొన్నారు.

ఇక, అప్పటి నుంచి భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డ్ వంటి ఉమ్మడి ఆస్తుల నిర్వహణలో పంజాబ్, హర్యానా రాష్ట్ర నామినీలకు కొంత నిష్పత్తిలో మేనేజ్‌మెంట్ పదవులు ఇవ్వడం ద్వారా సమతుల్యం పాటిస్తున్నారని తెలిపారు సీఎం భగవంత్‌ మాన్.. అయితే ఇటీవల అనేక చర్యల ద్వారా ఈ సమతుల్యతను దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.. పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల అధికారులతో సాంప్రదాయకంగా భర్తీ చేసే భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డు సభ్యుల పోస్టులను అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ అధికారులతో భర్తీ కోసం కేంద్రం ప్రకటన జారీ చేసిందని విమర్శలు గుప్పించారు.. మరోవైపు.. చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్‌లోని ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలు లభిస్తాయని తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించడం చర్చగా మారింది.. చండీగఢ్‌ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60కి పెంచుతున్నట్లు తెలిపారు. అయితే, అమిత్‌ షా ప్రకటన పంజాబ్‌లో పెద్ద దుమారం రేపింది. చండీగఢ్‌పై పంజాబ్ పెత్తనాన్ని తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తుందని ఆ రాష్ట్రం ఆరోపిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • assembly
  • Chandigarh
  • CM Bhagwant Mann
  • Punjab
  • Punjab assembly

తాజావార్తలు

  • COP33 Climate Summit 2028: COP33 వాతావరణ సదస్సు.. ఆతిథ్యం ప్రతిపాదనను ఉపసంహరించుకున్న భారత్

  • Iran: మళ్లీ మూతపడ్డ హోర్ముజ్ జలసంధి.. ఇరాన్ యు-టర్న్ వెనుక అసలు కారణం ఇదే!

  • RAAKA : గురువు చేయలేనిది.. శిష్యుడు చేస్తున్నాడా?

  • KKR vs LSG: తొలి విజయం కోసం ఎదురుచూపులు.. నేడు లక్నోతో కేకేఆర్ ఢీ

  • Israel-Lebanon War: లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 254కు చేరిన మృతులు

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions