Site icon NTV Telugu

Ramesh Bidhuri: ఢిల్లీ సీఎం అతిషి తల్లిదండ్రులు టెర్రరిస్టుకు మద్దతు ఇచ్చారు..

Ramesh

Ramesh

AAP vs BJP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, విపక్ష బిజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ సందర్భంగా మరోసారి కమలం పార్టీ నేత రమేష్‌ బిదూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి కూడా ఆయన ముఖ్యమంత్రి అతిషి మార్లెనాని టార్గెట్‌ చేశారు. ఆమె తల్లిదండ్రులు పార్లమెంట్‌పై దాడి చేసిన టెర్రరిస్టు అఫ్జల్‌ గురుకు మద్దతు ఇచ్చారని ఆరోపణలు గుప్పించారు. అతిషి తల్లిదండ్రులది భారత్‌ వ్యతిరేక మనస్తత్వం.. అందుకే పార్లమెంట్‌పై దాడి చేసిన వ్యక్తిని కాపాడేందుకు వారు ట్రై చేశారని పేర్కొన్నారు.

Read Also: Layoffs in US: ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు.. ఆ ఉద్యోగులకు లేఆఫ్స్

ఇక, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ పార్టీ తరపున రమేశ్ బిదూరి ముఖ్యమంత్రి అతిషిపై పోటీ చేయబోతున్నారు. ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ ఎన్నికలు జరగనుండగా.. 8వ తేదీన తుది ఫలితాలు వెల్లడించనున్నారు. కాగా, సీఎం అతిషియే లక్ష్యంగా వరుసగా బిదూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల, అతిషి తన తండ్రిని మార్చి మర్లెనా అనే పేరు నుంచి అతిషి సింగ్‌గా నామకరణం చేసుకుందని ఆరోపించారు. ఎన్నికలు రాగానే ఢిల్లీ వీధుల్లో అతిషి జింకలా పరుగులు పెడుతోందని మరోసారి కామెంట్స్ చేశారు. అలాగే, ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి రమేష్‌ బిదూరి అన్న ప్రచారం కూడా జరుగుతుంది.

Exit mobile version