CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..

  • ఢిల్లీలో ‘తిరంగా మార్చ్’కు సీజేపీ పిలుపు..
  • సీజేపీని వ్యతిరేకిస్తూ వ్యాపారుల నిరసన..
  • మోడీకి, సీఈసీ మద్దతుగా నినాదాలు..
  • ఢిల్లీలో మరోసారి ఉద్రిక్త వాతావరణం..
Delhi Protest

Delhi Protest

CJP Protest: ఢిల్లీలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాక్రోచ్ జనతా పార్టీ శుక్రవారం ‘‘తిరంగా మార్చ్’’కు పిలుపునిచ్చింది. ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్‌కు చేరుకోవాలని తన మద్దతుదారుల్ని కోరింది. ఇదిలా ఉంటే, సీజేపీ నిరసన నేపథ్యంలో స్థానిక వ్యాపారులు కన్నాట్‌ప్లేస్ చేరుకుని సీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీకి, ఢిల్లీ పోలీసులకు మద్దతు తెలిపారు. పాలికాబజార్‌లోని వ్యాపారులు సీజేపీకి వ్యతిరేకత తెలియజేశారు. అటు ముంబైలో కూడా వ్యాపారులు సీజేపీకి ఎదురుతిరిగారు. పండగ షాపింగ్ సమయాల్లో ఈ నిరసనలు ఏంటని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే, తిరంగ ర్యాలీకి వెళ్తున్న సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీప్కేతో పాటు AISA నాయకురాలు నేహా బోరాను కూడా పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. కన్నాట్‌ప్లేస్‌లో నిరసన తెలుపుతున్న సీజేపీ మద్దతుదారుల్ని కూడా పోలీసులు తీసుకెళ్తున్నారు. బారాఖంబా రోడ్డులో నిరసన తెలుపుతున్న లెఫ్ట్ పార్టీ విద్యార్థి సంఘాల సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు.