Abhijeet Dipke: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కన్వీనర్ అభిజిత్ దీప్కేను ఢిల్లీ పోలీసులు శుక్రవారం ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ‘లెహ్రా దో తిరంగా’’ పేరుతో జాతీయ జెండా ర్యాలీకి బయలుదేరడానికి కొద్ది నిమిషాల ముందు ఈ చర్య తీసుకున్నారు. అరెస్ట్ సమయంలో తాను ఏం చేశానని అదుపులోకి తీసుకుంటున్నారని పోలీసుల్ని దీప్కే ప్రశ్నించారు. శాంతిభద్రతలను కాపాడేందుకే ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
వారం వ్యవధిలో దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఇది రెండోసారి. గతంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో ఓటర్లను తొలగించారని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్(CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీ పోలీసులు విమానంలోనే అభిజిత్ దీప్కేను అదుపులోకి తీసుకున్నారు.
అక్టో్బర్ 16న ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో తిరంగా ర్యాలీకి సీజేపీ పిలుపునిచ్చింది. అంతకుముందు ఈ ర్యాలీ నిర్వహించొద్దని దీప్కే నివాసానికి వెళ్లి పోలీసులు నోటీసులు అందించారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 163 కింద జారీ చేసిన ఈ నోటీసులో కనాట్ ప్లేస్ పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మార్చ్‌కు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (NDMC) అనుమతి ఇవ్వలేదని పోలీసులు స్పష్టం చేశారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడం ఆంక్షల్ని ఉల్లంఘించడమే అవుతుందని హెచ్చరించారు.
#WATCH | Delhi | As CJP Founder Abhijeet Dipke leaves from the residence of NCP-SCP spokesperson Anish Gawande, a police official says, "We are placing you under preventive detention. Section 163 is in force in Connaught Place. You are being detained…"
CJP has called for ‘Lehra Do Tiranga’ protest at Central Park in Connaught Place today.
— ANI (@ANI) October 16, 2026

