పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తాగి ఫ్లైట్ ఎక్కారని.. దాంతో విమాన సిబ్బంది ఆయన్ను అడ్డుకున్నారు.. విమానం నుంచి దించేశారు.. ఈ పరిణామాలతో విమానం ఆలస్యంగా బయల్దేరిందంటూ.. రకరకాల ప్రచారాలు జరిగాయి.. అయితే, దీనిపై పౌర విమానయాన శాఖ విచారణ చేపట్టింది.. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయంలో ఢిల్లీ వెళ్లే విమానంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. తాగి ఉన్నారనే ఆరోపణలపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విచారణ చేపట్టనున్నట్టు మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఎయిర్‌పోర్ట్ వివాదంపై కేంద్రం దృష్టిసారించింది.. మద్యం మత్తులో ఉన్న మాన్‌ణు విమానం నుంచి దించేశారని వచ్చిన ఆరోపణలను పరిశీవలిస్తున్నాం.. ఈ ఘటనపై నిజానిజాలు తేల్చడం ముఖ్యమని పేర్కొన్నారు..
Read Also: WhatsApp: వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్..
అయితే, ఈ ఘటన విదేశాల్లో జరిగింది కాబట్టి.. దానిపై నిజాలు నిర్ధరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు సింధియా.. ఈ ఘటనపై సంబంధిత ఎయిర్‌పోర్ట్ నుంచి వివరాలు కోరతాం.. కానీ, సమాచారం ఇవ్వాలా లేదా అనే విషయం ఎయిర్‌లైన్స్ పరిధిలోనేది అన్నారు.. నాకు అందిన విజ్ఞప్తి ప్రకారం.. ఈ విషయంపై దృష్టిసారిస్తున్నట్టు తెలిపారు.. కాగా, జర్మనీ పర్యటనకు వెళ్లిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. ఆదివారం తిరిగి భారత్‌కు వచ్చారు.. కానీ, ఆయన ప్రయాణించిన విమానం ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకుంది.. దీనిపై ఆరోపణలు వచ్చాయి.. పంజాబ్ సీఎం.. ఢిల్లీకి తిరిగి వస్తుండగా విమానం నుంచి దించేశారంటూ.. శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్ ఆరోపణలు గుప్పించారు.. దీంతో, ఇది చర్చగా మారిపోయింది.. మద్యం మత్తులో, కనీసం నడవలేని స్థితిలో మాన్ ఉన్నారని… ఆ విషయాన్ని ఆ విమానంలో సీఎం మాన్‌తో ప్రయాణించిన తోటి ప్రయాణికులు తనకు తెలిపారంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.. ఇక, సీఎం పదవికి మాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.. ఆ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించాలని పౌర విమానయాన శాఖ మంత్రి సింధియాకు లేఖ రాశారు కాంగ్రెస్ నేత.. మరోవైపు.. ఈ ఆరోపణలను ఆమ్ఆద్మీ పార్టీ ఖండించింది. అదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేసింది.. సీఎం మాన్ షెడ్యూల్ ప్రకారమే తిరిగి వచ్చారు స్పష్టం చేసింది. అంతేకాదు.. ట్విట్టర్ వేదికగా లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ స్పందిస్తూ.. ఢిల్లీకి రావాల్సిన విమానాన్ని మార్చడం వల్లే ప్రయాణం ఆలస్యమైందని వివరించింది.. ఓ ప్రయాణికుడు మత్తులో ఉండటం వల్లే ఆలస్యమైనట్లు వచ్చిన వార్తలను మాత్రం ఖండించింది… ఇప్పుడు ఈ ఘటనపై విచారణ చేపట్టనుండడంతో.. ఎలాంటి విషయాలు వెలుగు చూస్తాయి.. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ చిక్కుల్లో పడతారా? అనేది చర్చగా మారింది.