Site icon NTV Telugu

Chirag Paswan: నితీష్ సర్కార్‌కు మద్దతు ఇవ్వడం బాధగా ఉంది.. బీజేపీ మిత్రపక్షం ఆగ్రహం..

Chirag Paswan

Chirag Paswan

Chirag Paswan: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితులపై ఎన్డీయేలోని మిత్రపక్షాలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల, బీహార్ వ్యాప్తంగా హత్యలు, అత్యాచారాలు, దోపిడీలకు సంబంధించిన సంఘటనలు సంచలనంగా మారాయి. తాజాగా, అంబులెన్స్‌లో ఒక మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన బీహార్ రాజకీయాలను కుదిపేస్తోంది. బీజేపీ కూటమిలో మిత్రపక్షంగా ఉన్న లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్, సీఎం నితీష్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాట్నాలో మీడియాతో మాట్లాడుతూ.. నేరకార్యకలాపాలు పెరగడంపై చిరాగ్ పాశ్వాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి, ఇలాంటి ప్రభుత్వానికి నేను మద్దతు ఇస్తున్నందుకు బాధగా ఉంది. నేరాలను నియంత్రించడం తప్పనిసరి, లేకుంటే పరిణామాలు దారుణంగా ఉంటాయి. నేరాలు ఇక్కడి ప్రజల జీవితాలతో ఆడుకుంటోంది’’ అని అన్నారు.

Read Also: Manipur: మణిపూర్‌లో భారీగా గన్స్, బుల్లెట్స్, గ్రెనేడ్స్ స్వాధీనం..

‘‘రాష్ట్రంలో హత్య, అత్యాచారం, సామూహిక అత్యాచారం, దోపిడీ, దోపిడీ, దొంగతనం, ఈవ్ టీజింగ్ వంటి వరుస నేరాలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నాయి. చర్యలు మరియు అరెస్టులు జరిగినప్పటికీ, రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? అనే ప్రశ్నను లేవనెత్తుతుంది ’’అని చెబుతూ, పరిపాలన నేరస్థుల ముందు తలవంచిందని ఆయన ఆరోపించారు. ఒకవేళ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే లక్ష్యంతో జరిగినా, వాటిని ప్రభుత్వం వెంటనే ఆపాలని కోరారు. ఇందులో ప్రభుత్వం హస్తం ఉంది లేదా ఈ సంఘటనలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆలస్యం కాకముందే చర్యలు తీసుకోవాలని బీహార్ ప్రభుత్వాన్ని ఆయన కోరారు.

ఇటీవల, బీహార్‌లో పలు హైప్రొఫైల్ మర్డర్స్ జరిగాయి. గత 30 రోజుల్లో పాట్నాలోని పరాస్ ఆస్పత్రిలో గ్యాంగ్‌స్టర్ చందన్ మిశ్రాను ఐదుగురు సాయుధులు హత్య చేశారు. పాట్నాలో ప్రముఖ పారిశ్రామిక వేత్త, బీజేపీ నేత గోపాల్ కేమ్కాను హత్య చేశారు. పాట్నాలోనే ఇసుక వ్యాపారి రమాకాంత్ యాదవ్ హత్యకు గురయ్యాడు. కిరాణా వ్యాపారి విక్రమ్ ఝా కూడా హత్య చేయబడ్డాడు. శుక్రవారం, హోంగార్డ్ పరీక్ష కోసం వచ్చిన మహిళపై ఇద్దరు వ్యక్తులు అంబులెన్స్‌లో సామూహిక అత్యాచారం చేశారు.

Exit mobile version