త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాదిలోపు బీహార్ ఎన్నికలు ముగియనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇక అన్ని పార్టీలు కదనరంగంలోకి దిగాయి. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ప్రధానంగా యువత ఓట్లే కీలకం. దీంతో ఇప్పటికే యువ నేతలు తేజస్వి యాదవ్, కన్హయ్యకుమార్, ప్రశాంత్ కిషోర్ లాంటివాళ్లు పొలిటికల్ యుద్ధంలోకి దిగారు. తమ సత్తాను నిరూపించుకునేందుకు ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Bandi Sanjay : అధిష్ఠానం ఇంకా రాష్ట్ర అధ్యక్షుడిని ఇంకా ప్రకటించలేదు
తాజాగా లోక్ జనశక్తి పార్టీ నేత, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ కూడా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతున్నారు. ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను కూడా పోటీ చేస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. కచ్చితంగా పోటీ చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ఫైనల్‌గా పార్టీ నిర్ణయమే తుది నిర్ణయంగా చెప్పుకొచ్చారు. తనకైతే పోటీ చేయాలనే ఉందని.. చివరిగా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలన్నారు. ప్రస్తుతం లోక్ జనశక్తి పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉంది. మోడీ కేబినెట్‌లో చిరాగ్ పాశ్వాన్ మంత్రిగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: Iran: నెలల్లోనే పుంజుకుంటుంది.. అణు సామర్థ్యంపై ఐఏఈఏ కీలక ప్రకటన
మరోసారి అధికారం కోసం నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రయత్నాలు చేస్తోంది. ఇంకోవైపు ఆర్జేడీ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి కూడా అధికారం కోసం ప్రయత్నిస్తోంది. మరోవైపు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా తమకు అధికారం కట్టబడితే.. నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తామని ప్రకటించారు. బీహార్ ప్రజలు ఈసారి ఏ పార్టీకి అధికారం కట్టబెడతారో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.
