NTV Telugu Site icon

China Spy: బౌద్ధ సన్యాసిని ముసుగులో చైనా గూఢాచారి.. అరెస్ట్ చేసిన పోలీసులు

China Spy

China Spy

Chinese woman arrested on allegations of spying: తన గుర్తింపు దాచి పెడుతూ.. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అభియోగాలపై గురువారం ఓ చైనా మహిళను అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. బౌద్ధ సన్యాసిగా జీవిస్తూ.. చైనా తరుపున గూఢచర్య చేస్తుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నకిలీ గుర్తింపు కార్డుతో భారతదేశంలో నివసిస్తూ.. దేశ వ్యతిరేక కార్యకాలపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై చైనా మహిళను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read Also: Pakistan: తల్లిని పట్టుకుని ఏడ్చిన హిందూ బాలిక.. వెనక్కి తగ్గిన పాకిస్తాన్ కోర్టు..

చైనాలోని హెనాన్ ప్రావిన్సుకు చెందిన కై రువోగా పోలీసులు గుర్తించారు. బౌద్ధ సన్యాసిని ముసుగులో డోల్మా లామాగా పేరు మార్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉత్తర ఢిల్లీలోని టిబెటన్ శరణార్థుల కాలనీ మజ్ను కా తిలాలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సంప్రదాయ బౌద్ధ సన్యాసి ధరించే దుస్తుల్లో మహిళ ఉంది. ఆమె నుంచి డోల్మా లామా పేరుతో నేపాల్ పౌరసత్వ ధ్రువీకరణ పత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో విచారించినప్పుడు సదరు మహిళ చైనా పౌరురాలని తేలిందని.. 2019లో భారత దేశానికి వచ్చినట్లు గుర్తించారు.

ఆమెపై ఐపీసీ సెక్షన్లు 120 బి (నేరపూరిత కుట్ర), 419 (వ్యక్తిగతంగా మోసం చేయడం), 420 (మోసం చేయడం), 467 (సెక్యూరిటీని ఫోర్జరీ చేయడం) కింద కేసులు నమోదు చేశారు. ఆమె గుర్తింపు కార్డులో నేపాల్ రాజధాని ఖాట్మాండు చిరునామా ఉందని పోలీసులు గుర్తించారు. విచారణ సమయంలో తనను చైనా కమ్యూనిస్ట్ పార్టీలోని కొంతమంది నేతలు చంపాలని చూస్తున్నారని వెల్లడించింది. ఇంగ్లీష్, నేపాలీ, చైనీస్ భాషల్లో మహిళ మాట్లాడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.