Rafale jets: జిత్తులమారి చైనా, ఎప్పటికప్పుడు వేరే దేశాల ఆయుధాలను కాపీ కొడుతూ మేడ్ ఇన్ చైనా ఆయుధాలను తయారు చేస్తుంటుంది. అయితే, తాజాగా జరిగిన సంఘటన చూస్తే మరోసారి అదే పనిలో ఆ దేశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫ్రెంచ్ తయారీ రాఫెట్ ఫైటర్ జెట్ సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు చైనా జాతీయులను గ్రీస్ దేశంలో అరెస్ట్ అయ్యారు. గ్రీస్‌లోని తనగ్రాలో రాఫెల్ ఫైటల్ జెట్స్ ఫోటోలు తీసినందుకు, హెలినిక్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ(HAI) ఫెసిలిటీని చిత్రీకరించినందుకు అక్కడి అధికారులు వీరిని అరెస్ట్ చేశారు.
చైనాకు చెందిన నలుగురు వ్యక్తులు ఆ ప్రాంతంలోని సున్నితమైన సైనిక స్థావరాలను ఫోటో తీస్తున్నట్లు గుర్తించిన తర్వాత అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. వీరి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో గూఢచర్యం చేస్తు్న్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నలుగురిలో ఒకరు మహిళ కూడా ఉన్నారు. వీరు తీసిన చిత్రాలను పరిశీలిస్తే రాఫెట్ ఫైటర్ జెట్ ఫోటోలు ప్రముఖంగా కనిపించాయి. పోలీసుల చెబుతున్న దాని ప్రకారం, వీరి వద్ద విస్తృతమైన సైనిక సమాచారానికి సంబంధించిన ఫోటోలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Russia: భారతీయులకు రష్యా బంఫర్ ఆఫర్.. 10 లక్షల మందికి ఉద్యోగాలు..?
ఇటీవల గ్రీస్-భారత్ సైనిక సంబంధాలు గణనీయంగా బలపడ్డాయి. ఈ క్రమంలోనే ఈ వార్త వెలుగులోకి వచ్చింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ఆపరేషన్‌లో రాఫెట్ ఫైటర్ జెట్లు కీలక పాత్ర పోషించాయి. అయితే, రాఫెట్ జెట్లను పాకిస్తాన్ కూల్చివేసినట్లు చైనా పత్రికలు తప్పుడు ప్రచారం చేశాయి. అయితే, ఇదంతా వట్టిదే అని ఆ తర్వాత తెలిసింది. ప్రస్తుతం, గ్రీస్‌లో అరెస్ట్ చేయబడిన వ్యక్తులు ప్రత్యేకంగా రాఫెట్ విమానాల ఫోటోలనే తీశారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో రాఫెట్ ఫైటర్ జెట్ల పనితీరుపై చైనా విష ప్రచారం చేసింది. పాకిస్తాన్ ఉపయోగించిన తమ సాంకేతికత అత్యుత్తమంగా పనిచేసినట్లు నమ్మించే ప్రయత్నం చేసింది. భారత్-పాక్ వివాద సమయంలో 1000 కంటే ఎక్కువ కొత్త సోషల్ మీడియా అకౌంట్లతో చైనా టెక్నాలజీని పొగుడుతూ ఒక కథనాన్ని ముందుకు తెచ్చింది. డసాల్ట్ ఏవియేషన్ ఇప్పటివరకు 533 రాఫెల్ జెట్‌లను విక్రయించింది, వాటిలో 323 ఈజిప్ట్, భారతదేశం, ఖతార్, గ్రీస్, క్రొయేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సెర్బియా మరియు ఇండోనేషియాతో సహా అనేక దేశాలకు ఎగుమతి చేయబడ్డాయి.
