NTV Telugu Site icon

China: డర్టీ డ్రాగన్ ఇక మారదు… కీలక సమావేశానికి ఇండియాను పిలవని చైనా

China Vs India

China Vs India

China holds first Indian Ocean Region meet with 19 countries without India: అవకాశం దొరికితే భారత్ ను ఎలా దెబ్బతీయాలా..? అనే ఆలోచనలోనే ఉంటుంది డ్రాగన్ కంట్రీ చైనా. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఆసియా పరిధిలో భారత్ ప్రాముఖ్యత, ప్రాధాన్యత పెరగడాన్ని తట్టుకోలేకపోతోంది చైనా. భారత ప్రాధాన్యతను తగ్గించాలని ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఇటీవల చైనా హిందూ మహాసముద్ర ప్రాంత సమావేశాన్ని నిర్వహించింది. హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాలు ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది. అయితే భారతదేశాన్ని మాత్రం ఆహ్వానించింది. గతేడాది కూడా భారతదేశం పాల్గొనకుండా కోవిడ్-19 వ్యాక్సిన్ సహకారంపై చైనా దక్షిణాసియా దేశాలతో సమావేశాన్ని నిర్వహించింది.

చైనా ఇటీవల మొదటి హిందూమహాసముద్ర ప్రాంత సమావేశాన్ని నిర్వహించింది. మొత్తం 19 దేశాలతో చైనా ఈ వారం ఈ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి భారతదేశానికి ఆహ్వానం అందలేదు. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖకు సంబంధించిన చైనా ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ కోఆపరేషన్ ఏజెన్సీ (సిఐడిసిఎ) నవంబర్ 21 న అభివృద్ధి సహకారంపై చైనా-ఇండియన్ ఓషన్ రీజియన్ ఫోరమ్ యొక్క సమావేశాన్ని నిర్వహించింది, ఇందులో 19 దేశాలు పాల్గొన్నాయని పత్రికా ప్రకటన విడుదల చేసింది.

Read Also: Chhattisgarh: వీళ్లు మనుషులు కాదు.. అక్కా చెల్లిళ్లపై తండ్రి, మేనమామ లైంగిక వేధింపులు

యునాన్ ప్రావిన్స్ లోని కున్ మింగ్ లో ‘‘ షేర్డ్ డెవలప్మెంట్: థియరీ అండ్ ఫ్రాక్టీస్ ఫ్రమ్ ద పెర్స్‌పెక్టివ్ ఆఫ్ ది బ్లూ ఎకానమీ’’ అనే పేరుతో హైబ్రీడ్ పద్ధతిలో ఈ సమావేశాన్ని నిర్వహంచింది. ఇండోనేషియా, పాకిస్థాన్, మయన్మార్, శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవులు, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఒమన్, దక్షిణాఫ్రికా, కెన్యా, మొజాంబిక్, టాంజానియా, సీషెల్స్, మడగాస్కర్, మారిషస్, జిబౌటీ, ఆస్ట్రేలియాతో సహా 19 దేశాల ప్రతినిధులు, మూడు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. దీనికి మాజీ ఉపవిదేశాంగ మంత్రి, భారతదేశంలో రాయబారి అయిన లువో జావోహుయ్ నేతృత్వం వహించారు.

హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూస్తోంది. శ్రీలంక, పాకిస్తాన్ దేశాల్లో పోర్టులను నిర్మిస్తోంది. జిబౌటీలో చైనా ఏకంగా ఓ నౌకాదళ స్థావరాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. శ్రీలంకలో హంబన్ టోట పోర్టును 99 ఏళ్లకు లీజుకు తీసుకుంది. పాకిస్తాన్ లో గ్వాదర్ పోర్టును నిర్మిస్తోంది. మాల్దీవుల్లో కూడా పెట్టుబడులు పెడుతోంది. ఇక్కడ నుంచి భారత్ పై నిఘా పెట్టేందుకు ప్రయత్నిస్తోంది డ్రాగన్ కంట్రీ. హిందూ మహాసముద్ర దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య, శాస్త్రసాంకేతిక విషయాల్లో భాగస్వామ్యం అని చైనా చెబుతున్నప్పటికీ.. అంతిమ లక్ష్యం మాత్రం భారత్ ను ఇబ్బంది పెట్టడమే.